Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్పూరంతో ఎన్ని లాభాలో... తమలపాకులో పెట్టుకుని నమిలితే...

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (17:57 IST)
భారతీయ సంప్రదాయంలో పూజగదిలో తప్పనిసరిగా ఉండే వస్తువుల్లో కర్పూరం ఒకటి. ఇది అనేక రకాలుగా ఉన్నప్పటికీ.. మనకు తెలిసింది మాత్రం రెండు రకాలు మాత్రమే. ఈ కర్పూరం కేవలం దేవుడి పూజకు మాత్రమేకాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా పచ్చ కర్పూరంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
* ఒకటి లేదా 2 పలుకుల కర్పూరాన్ని మంచి గంధం లేదా వెన్నతో కలిసి తమలపాకులో పెట్టి నమిలి రసాన్ని మింగినట్టయితే తక్షణం వేడి తగ్గిస్తుంది. 
* పచ్చకర్పూరాన్ని మూడు పూటలా ఒకటి లేదా రెండు పలుకులు తీసుకుంటే బలంతో పాటు రక్తపుష్టి కలుగుతుంది. 
* కళ్లు బైర్లుకమ్మడం, తలతిరగడం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమట పట్టడం వంటివి తగ్గిపోతాయి. 
* లైంగిక సామర్థ్యంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. కంటి జబ్బులు, రక్తస్రావాన్ని అరికడతాయి. 
 
* రక్తపోటుతో బాధపడేవారు వీటిని తీసుకున్నట్టయితే బీపీ అదుపులో ఉంటుంది. 
* పచ్చ కర్పూరంతో కళ్ళమంటలు, కళ్లు ఎరుపెక్కడం, నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. 
* ముఖ్యంగా, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరంలను మెత్తగా నూరి, ఇందులో ఎండుద్రాక్ష వేసి చిన్నటి మాత్రలా తయారు చేసుకుని రాత్రి పడుకునేముందు వేసుకుంటే వీర్యవృద్ధి కలుగుతుందని గృహవైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
* వేసవికాలంలో పచ్చ కర్పూరాన్ని తీసుకుంటే వడదెబ్బతో పాటు అతిదాహం, తపన, శరీరం చిటపటలాడటం, శోష తగ్గటం వంటివి తగ్గిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం