Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెలో నానబెట్టిన ఎండు ఖర్జూరాలను తింటే...?

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (20:39 IST)
ఎండు ఖర్జూరాలు మన ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే తేనెలో ఎండు ఖర్జూరాలను వారంపాటు నానబెట్టి తినడం వల్ల  అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్త హీనత ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుంది. ఎండు ఖర్జూరాన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
 
1. ఒక గాజుసీసాలో మూడు వంతుల తేనె, ఒక వంతు గింజ తీసిన ఎండు ఖర్జూరాలను వేయాలి. వీటిని తేనెలో బాగా కలిపి మూతపెట్టి వారం రోజులు కదలకుండా ఉంచాలి. వారం తర్వాత రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున ఈ ఖర్జూరాలను తినడం వల్ల శృంగార సమయంలో వచ్చే అలసటను దూరం చేస్తుంది.  
 
2. తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల జబ్బుల బారిన పడటం తగ్గుతుంది. నిద్రలేమితో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందొచ్చు.
 
3. ఎండు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ మిశ్రమంలోని యాంటీ బయాటిక్ గుణాల వల్ల గాయాలు త్వరగా మానతాయి.  చిన్నారులు చదువుల్లో చురుగ్గా మారతారు. 
 
4. తేనె, ఖర్జూర మిశ్రమంలో కాల్షియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ మిశ్రమం రక్త హీనతను తగ్గించి, ఎముకలను బలంగా మారుస్తుంది. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 
 
5. మలబద్ధకంతో బాధపడేవారు వారంలో మూడు రోజులు ఖర్జూరాలను తింటే  మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి. కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి. రక్త సరఫరా సరిగా జరిగేలా మెరుగుపరుస్తుంది.
 
6. ఖర్జూరాల్లో కొలస్ట్రాల్ ఉండదు కాబట్టి ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్జూరాల్లో గ్లూకోజ్, ప్రక్టోజ్,సుక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందచేస్తాయి. 
 
7. ఖర్జూరాల్లో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి కంటిచూపుని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీని కంట్రోల్ చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments