Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావవుతుంటే... క్యాల‌రీల‌ను ఇలా కరిగించాలి...!

• అప్పుడప్పుడూ దీర్ఘ శ్వాస తీసుకుని వదలడం అలవాటుగా మార్చుకోండి. దీంతో శరీరంలోని కండరాలు సంకోచించి, వ్యాకోచిస్తాయి. దీనివల్ల క్యాల‌రీలు కరుగుతాయి. ఆఫీసులో ఉన్నా, ఇంట్లో టీవీ చూస్తున్నా సరే వీటిని సులభంగా చేయొచ్చు.

Webdunia
మంగళవారం, 14 జూన్ 2016 (17:38 IST)
• అప్పుడప్పుడూ దీర్ఘ శ్వాస తీసుకుని వదలడం అలవాటుగా మార్చుకోండి. దీంతో శరీరంలోని కండరాలు సంకోచించి, వ్యాకోచిస్తాయి. దీనివల్ల క్యాల‌రీలు కరుగుతాయి. ఆఫీసులో ఉన్నా, ఇంట్లో టీవీ చూస్తున్నా సరే వీటిని సులభంగా చేయొచ్చు.
 
• మామూలుగా నిద్రలేచే సమయాన్ని కాస్త ముందుకు జరుపుకుని, ఒక‌ పదిహేను నిమిషాలు ముందే నిద్రలేచేలా చూసుకోండి. ఆ సమయంలో మీ పడక గదిలోనే కాసేపు స్కిప్పింగ్ చేస్తున్నట్టు మెల్లగా దూకండి. శరీరాన్ని ముందుకూ, వెనక్కి వంచండి. దీనివల్ల శరీరంలో అదనంగా చేరిన క్యాల‌రీలు కరుగుతాయి.
 
• అప్పుడప్పుడూ చూయింగ్‌ గమ్‌ని నమలండి. దవడ కండరాలు చక్కగా కదులుతాయి. దీనివల్ల క్యాల‌రీలు ఖర్చు కావడమే కాకుండా మిగతా చిరుతిళ్లు ఎక్కువగా తినే అవకాశం ఉండదు.
 
• మీ వెంట మంచినీళ్ల సీసాను పెట్టుకోండి. నీళ్లు తాగుతూ ఉండండి. ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పోవడమే కాదు, శరీరం తేమగా ఉంటుంది. క్యాల‌రీలూ ఖర్చవుతాయి.
 
• టీవీ చూస్తున్నప్పుడు కింద కూర్చోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఏదైనా పనిపడి లేచినప్పుడల్లా శరీరానికి ఎంతో కొంత వ్యాయామం అందినట్లు ఉంటుంది. కూర్చున్నప్పుడు మెడను సాగదీయడం, చేతుల్ని కదిలించడం కూడా చాలా మేలు చేస్తాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments