Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలనుకుంటున్నారా...! ఐతే ఇవి చేయండి...

ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని సేవించండి. మీరు తీసుకునే టీ, కాఫీ, జ్యూస్‌లలో చక్కెర శాతాన్ని తగ్గించుకోండి. చిన్న కప్పుల్లో (ఐదు నుంచి ఆరు) అన్నం తీసుకోండి లేదా స్నాక్స్ తీసుకుంటుండండి. ప్రతి రోజు నడక తప్పనిసరి. ఇంటి బయట, షాపింగ్‌కు వెళ్ళాలన్నా నడ

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (20:15 IST)
ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని సేవించండి. మీరు తీసుకునే టీ, కాఫీ, జ్యూస్‌లలో చక్కెర శాతాన్ని తగ్గించుకోండి. చిన్న కప్పుల్లో (ఐదు నుంచి ఆరు) అన్నం తీసుకోండి లేదా స్నాక్స్ తీసుకుంటుండండి. ప్రతి రోజు నడక తప్పనిసరి. ఇంటి బయట, షాపింగ్‌కు వెళ్ళాలన్నా నడిచే వెళ్ళండి. రోజుకు కనీసం 45 నిమిషాలు నడవండి. దీంతో మీ శరీరంలోని క్యాలరీలు ఖర్చవుతాయి. 
 
వీలైనంత ఎక్కువగా సలాడ్‌లు తీసుకోండి. అలాగే మీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలుండేలా చూసుకోండి. మీకు ఆకలి వేసినప్పుడే తినేందుకు ప్రయత్నించండి. ఆకలి లేనప్పుడు తినకండి. ప్యాకేజ్ ఫుడ్‌ అంటే... ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకండి. వీలైనంతమేరకు వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
 
మీరు లిఫ్టులో పైఫ్లోర్‌లోకి వెళ్ళేటట్లయితే లిఫ్టును ఉపయోగించకుండా మెట్ల దారిలో నడిచి వెళ్ళండి. మీ ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. మీకు పండ్ల రసం తాగాలనిపిస్తే పండ్ల రసంకన్నా పండ్లను సేవించండి. ప్రకృతి పరంగా లభించే కూరగాయలన్నీ సమయానుసారం ఆహారంలో ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా రాత్రిపూట కేవలం కూరగాయలతో చేసిన సలాడ్ మరియు మొలకెత్తిన గింజలుండేలా చూసుకోండి. అందులోకూడా ఎక్కువగా తినకండి. తగినంత మాత్రమే ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు. 
 
మీ కార్యాలయంలో నిత్యం కూర్చొని పని చేసేవారైతే ప్రతి రెండు గంటలకొకసారి కార్యాలయమంతా కలియ తిరగండి. అలాగే ఇంట్లో కూడా కనీసం ఐదు నిమిషాల పాటు నడవండి. దీంతో మీ శరీరం తేలికగా మారుతుంది. ప్రతి రెండు గంటలకొకసారి ఓ ఐదు నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేయండి. తదేకంగా గంటలకొద్ది టీవీని చూడకండి. టీవీని చూస్తూ తినడం మూలాన లావు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

తర్వాతి కథనం
Show comments