నిజంగా బరువు తగ్గాలనుకుంటే ఇలా చేయొద్దు...

ఇపుడు ప్రతి ఒక్కరినీ అధిక బరువు సమస్య వేధిస్తోంది. ఫలితంగా చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉపవాసాలు, వ్యాయామాలు వంటి లేనిపోని కసరత్తులు చేస్తుంటారు.

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (15:52 IST)
ఇపుడు ప్రతి ఒక్కరినీ అధిక బరువు సమస్య వేధిస్తోంది. ఫలితంగా చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉపవాసాలు, వ్యాయామాలు వంటి లేనిపోని కసరత్తులు చేస్తుంటారు. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ... బరువు తగ్గేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామనే ధీమాతో ఆహారాన్ని పుష్టిగా లాగించేస్తుంటారు. ఇలాచేయడం వల్ల బరువు తగ్గడం సంగతి అటుంచితే.. మరింతగా బరువు పెరిగే అవకాశం ఉంది. నిజంగా బరువు తగ్గాలనుకునేవారు ఇలా చేయకుండా ఉంటేచాలు.
 
* బరువు తగ్గేందుకు ఉపవాసాలు ఉంటుంటారు. తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటారు. కానీ కూరగాయలు, ఆకుకూరలను తీసుకోవడం మానేస్తారు. అలా చేయరాదు. 
* నిత్యం వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటేనే శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. తద్వారా బరువు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. 
* రోజూ వ్యాయామం చేస్తున్నాం, సరైన పోషకాహారం తీసుకుంటున్నాం కదా అని చెప్పి వేగంగా ఫలితాన్ని ఆశిస్తారు. బరువు తగ్గడం అనేది నిజానికి కొందరిలో నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ఒక్కసారి బరువు తగ్గడం ప్రారంభమైతే ఇక మీరు ఆగమన్నా బరువు తగ్గడం మాత్రం ఆగదు. 
* అధిక బరువును తగ్గించుకునే వారు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను తక్కువగా తీసుకుంటారు. అలా చేయరాదు. ఉదయం తినే ఆహారం బాగా హెవీగా ఉండాలి. రాత్రి తినే ఆహారం చాలా తక్కువగా ఉండాలి. 
* వ్యాయామం చేస్తున్నాంకదాని అధిక ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటారు. అలా చేయడం వల్ల బరువు తగ్గకపోగా, ఎప్పటికీ అదే బరువులో కొనసాగుతారు. కనుక బరువు తగ్గాలనుకునే వారు రోజూ ప్రోటీన్లను తగిన మోతాదులోనే తీసుకోవాలి. 
* గంటల తరబడి వ్యాయామం చేసినప్పటికీ తిండి కూడా బాగా లాగించేయరాదు. డైట్ పాటించాలి. పోషకాలు ఉన్న ఆహారాన్ని మాత్రమే అది కూడా మోతాదులో తీసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టి.కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కీలక పదవి

నా జీతం రూ. 2 లక్షలు, నా భార్యకు ముగ్గురితో ఎఫైర్, అందుకే చనిపోతున్నా

కె. కవిత పార్టీ మార్పు.... ఈసీ గుర్తింపు .. కొత్త పార్టీ పేరు ఏంటంటే...

Rare Liver Transplant: 14 గంటల పాటు సర్జరీ-18 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి

Andhra Pradesh Class 10 results: 85.25 శాతం ఉత్తీర్ణత.. బాలుర కంటే బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda: తిరుమలలో సాంప్రదాయబద్ధంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల వివాహం

Anupama: మారేడుమిల్లి అడవుల్లో భోగి చిత్రం నుంచి అనుపమ పరమేశ్వరన్ లుక్

శివాజీ డ్రెస్సింగ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన గాయత్రీ గుప్తా

Pooja Hegde : బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే ప్రేమాయణం

ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ లాయల్ కష్టమర్ల కోసం మైఖేల్ చిత్ర ప్రత్యేక ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments