Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లు మాట్లాతుంటే నోరు వాసన వస్తోందా...? ఈ చిట్కాలు షేర్ చేయండి...

కొంతమంది మాట్లాడుతున్న, నవ్వుతున్నా నోరు వాసన వస్తుంది. నోరు దుర్వాసన రావడానికి పళ్లు సరిగా బ్రెష్ చేసుకోకపోవడం, చిగుళ్ల సమస్యలతో బాధపడటం, పళ్లపై గారలు ఏర్పడి ఎన్నిసార్లు శుభ్ర పరచుకున్నా పోకపోవడం లాంటి అనేక కారణాలు ఉంటాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (22:13 IST)
కొంతమంది మాట్లాడుతున్న, నవ్వుతున్నా నోరు వాసన వస్తుంది. నోరు దుర్వాసన రావడానికి పళ్లు సరిగా బ్రెష్ చేసుకోకపోవడం, చిగుళ్ల సమస్యలతో బాధపడటం, పళ్లపై గారలు ఏర్పడి ఎన్నిసార్లు శుభ్ర పరచుకున్నా పోకపోవడం లాంటి అనేక కారణాలు ఉంటాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా, పళ్లు తెల్లగా ఉండి నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాలన్నా వంటింట్లో ఉండే ఉప్పు చాలా ఉపయోగపడుతుంది.
 
పళ్లను శుభ్రపరచుకోవడానికి ఉప్పును ఈక్రింది విధంగా వాడవచ్చు....
1. కొంచెం ఉప్పు తీసుకొని దానిలో నీరు పోసి పేస్టులా చేసుకొని, బ్రష్‌తో పళ్లు తోముకుంటే తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఉప్పు నోటిలో ఉండే బ్యాక్టిరియాను చంపుతుంది. చిగుళ్లు, పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. 
 
2. రోజూ ఉదయం పళ్లు శుభ్రపరచుకున్న తర్వాత గోరువెచ్చని నోటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించాలి. ఆతర్వాత తిరిగి నోటిని మంచి నీటితో శుభ్రపరచాలి. ఈవిధంగా రోజు చేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది.
 
3. కొంచెం మిరియాల పొడి, పసుపు, ఉప్పు కలిపి దాంట్లో కొంచెం నువ్వుల నూనె వేసి పేస్టులా చేసి దాంతో చిగుళ్లను రుద్దితే చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా మనం వాడుకునే పేస్టుపై కొంచెం ఉప్పు వేసి తోముకుంటే పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
 
4. నిమ్మతొక్కలను పొడి చేసి దాంట్లో ఉప్పు కలిపి ఒక సీసాలో పోసుకొని రోజూ కొంచెం పొడి తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు కలిపి పేస్టులా చేసి పళ్లు తోముకుంటే అందంగా మెరుస్తూ ఉంటాయి.
 
5. బ్రెడ్‌ను కాల్చి పొడి చేసి దాంట్లో తేనె కొంచెం ఉప్పు కలిపి పళ్లను రుద్దితే పళ్లపై గార పోతుంది. 
 
6. నోటి దుర్వాసనతో బాధ పడేవారు ఉప్పు, బేకింగ్ సోడా సమపాళ్లల్లో కలిపి పళ్లపొడిలా తయారుచేసుకొని రోజు పళ్లు తోముకుంటుంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments