వేసవికాలం: బాలింతలు శిశువులకు నీరు కూడా తాగించాలట?

బాలింతలు శిశువులకు పాలు పట్టి నిద్రపెట్టేయడం చేస్తుంటారు. ఈ పద్ధతి వానాకాలం, శీతాకాలంలో ఓకే కానీ.. వేసవి కాలంలో మాత్రం కూడదని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. అప్పుడే పుట్టిన శిశువులు,

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (13:28 IST)
బాలింతలు శిశువులకు పాలు పట్టి నిద్రపెట్టేయడం చేస్తుంటారు. ఈ పద్ధతి వానాకాలం, శీతాకాలంలో ఓకే కానీ.. వేసవి కాలంలో మాత్రం కూడదని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే.. అప్పుడే పుట్టిన శిశువులు, ఆరు నెలలు కూడా నిండని పాపాయి, ఐదేళ్లు నిండిన చిన్నారుల పట్ల వేసవి కాలంలో అధిక శ్రద్ధ తీసుకోవాలి. వారికి అప్పుడప్పుడు ద్రవపదార్థాలను ఇస్తుండాలి. నీరు, జ్యూస్‌లు, నీటిశాతం గల పండ్లు ఇవ్వడం ద్వారా చిన్నారులను డీ-హైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. 
 
పాలుపట్టిన తర్వాత శిశువులను వెంటనే నిద్రిపుచ్చకుండా.. ఐదు నిమిషాల తర్వాత రెండు లేదా మూడు స్పూన్లు తాగించి.. రెండు నిమిషాల తర్వాత నిద్రపుచ్చాలి. మాసాలు నిండని శిశువులకు మూడు గంటలకోసారి పాలు పట్టాలి. తల్లిపాలలో తగిన శాతం నీరున్నప్పటికీ.. అదనంగా రెండు స్పూన్లు లేదా అరగ్లాసుడు నీరును అప్పుడప్పుడు శిశువులకు ఇస్తుండాలి. 
 
ఇలా చేయడం ద్వారా ఎండల్లో పిల్లల్లో దాహం వుండదు. అయితే చిన్నారులకు ఇచ్చే నీటిని కాచి వడగట్టి ఆరబెట్టిన తర్వాత గోరు వెచ్చగా వున్నప్పుడు ఇవ్వాలి. ఇలా చేస్తే శిశువుల్లో అజీర్తి సమస్య ఏర్పడదని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ - ప్రాణాలు తీసుకున్న ఆరుగురు విద్యార్థులు

వివాహిత బ్లాక్‌మెయిల్ : ఫిట్నెస్ ట్రైనర్ ఆత్మహత్య... ఎక్కడ?

18న జూలై నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్లు రిలీజ్

వరుడు మేకప్ కిట్ తేలేదని పెళ్లికి నో చెప్పిన వధువు.. ఎక్కడ?

తప్పుడు లెక్కలతో కాలుపెట్టారో జలసంధిలోని సుడిగుండంలో మునిగిపోతారు : ఇరాన్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan New look: గ్యాంగ్ స్టర్ గా రామ్ చరణ్ కొత్త సినిమా చేయబోతున్నారా !

Mangli clarity: ఈ పార్టీలు, రాజకీయాలు నాకు వద్దంటూ మీడియా ముందు కన్నీరు పెట్టిన మంగ్లీ

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

తర్వాతి కథనం
Show comments