Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెను అలా వాడకూడదు, వాడితే సమస్యలే...

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (21:40 IST)
తేనె అనగానే అది ఎంతో ఆరోగ్యం అని తీసుకుంటుంటారు. కానీ ఆ తేనెను వాడకూడని సందర్భాలు వున్నాయన్నది మీకు తెలుసా? ఎప్పుడు వాడకూడదో తెలుసుకుందాం.
 
తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను మరిగించకూడదు.
 
తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి. ఎందుకంటే తేనెలో రకరకాల పువ్వుల మకరందాల అంశ ఉంటుంది. వీటిల్లో విష పుష్పాలు సైతం ఉంటాయి.
 
మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు.
 
తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు.
 
తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి.
 
తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు. ఇది విరుద్ధం. తెలిసింది కదా... కనుక తేనెను తీసుకునేటపుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తీసుకుంటూ వుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments