Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట పాలలో తేనె కలుపుకుని తాగితే...

నిద్ర పట్టకుండా చాలామంది సతమతమవుతుంటారు. ఇలాంటివారు రాత్రిళ్లు తేనె కలుపుకున్న పాలు తాగితే చక్కటి నిద్ర వస్తుంది. ఇంకా తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ పావు గ్లాసు గోరు వెచ్చటి నీళ్లలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే ఒళ్లు తగ్గుతుంది.

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (22:26 IST)
నిద్ర పట్టకుండా చాలామంది సతమతమవుతుంటారు. ఇలాంటివారు రాత్రిళ్లు తేనె కలుపుకున్న పాలు తాగితే చక్కటి నిద్ర వస్తుంది. ఇంకా తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ పావు గ్లాసు గోరు వెచ్చటి నీళ్లలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే ఒళ్లు తగ్గుతుంది.
 
గాయాలు, పుళ్లు మానడానికి తేనె ఉపకరిస్తుంది. ఎందుకంటే దీనిలో గాయాలను మాన్చే గుణం ఉన్నది. దీని పీహెచ్ 3.2 నుంచి 4.5 దాకా ఉండటం వల్ల శరీరంలోకి వచ్చిన బ్యాక్టీరియాను అదుపు చేస్తుంది. 
 
కంటికి అవసరమైన విటమిన్ "ఎ"ను శరీరం తీసుకునేందుకు సాయపడుతుంది. ఇది శరీరపు శక్తిని ఇనుమడింపజేస్తుంది. మానసిక ప్రశాంతతను, సహజమైన నిద్రను ఇస్తుంది. తేనె నీళ్లు పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు తగ్గుతాయి. 
 
నిమ్మకాయ రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే కడుపు ఉబ్బరం, నొప్పి తగ్గుతుంది. వేడి నీటిలో తేనె, నిమ్మరసం పది చుక్కలు వేసుకుని తాగితే ఆయాసం తగ్గుతుంది. తేనె, తులసి ఆకురసం తీసుకుంటే.. దగ్గు, శ్లేష్మం తగ్గుతుంది. 
 
తేనెలో కొంచెం మిరియాలపొడి కలుపుకుని తీసుకుంటే జలుబు తగ్గుతుంది. రెండు చెంచాల తేనెలో కోడిగుడ్డులోని తెల్లని సొన, కొంచెం శనగపిండి కలుపుకుని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేసిన పనులేంటి?

రేషన్ బియ్యం మాయం కేసు : విచారణకు హాజరైన పేర్ని నాని భార్య!

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments