Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు, లవంగము కలిపి చప్పరిస్తుంటే...

ఉప్పు ఆహార పదార్థములకు రుచిని కలిగిస్తుంది. ఉప్పు ఆరు రకములు. 1. సైంధవ లవణము. 2. సముద్ర లవణము 3. బిడా లవణము 4. సౌవర్చ లవణము 5. రోమక లవణము 6. ఔద్భిద లవణము. సైంధవ లవణమును బి.పి గల వారు కూడా కొద్ది మోతాదులో వాడవచ్చును. ఉప్పు ఆకలిని కలిగించును. ఆహారమును

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (22:05 IST)
ఉప్పు ఆహార పదార్థములకు రుచిని కలిగిస్తుంది. ఉప్పు ఆరు రకములు. 1. సైంధవ లవణము. 2. సముద్ర లవణము 3. బిడా లవణము 4. సౌవర్చ లవణము 5. రోమక లవణము 6. ఔద్భిద లవణము.
 
సైంధవ లవణమును బి.పి గల వారు కూడా కొద్ది మోతాదులో వాడవచ్చును. ఉప్పు ఆకలిని కలిగించును. ఆహారమును జీర్ణం చేయును. చలువ జేయును. కళ్ళకు చాలా మంచిది.
 
వాము, ఉప్పు కలిపి తింటే కడుపునొప్పి అజీర్తి తగ్గిపోతాయి. ఉప్పును బాగా వేయించి కాపు పెడితే కీళ్ళ నొప్పులు, బెణుకులు, వాపు, దెబ్బల వల్ల కలిగిన నొప్పులు నడుం నొప్పి తగ్గిపోతాయి. ఎండా కాలంలో వడదెబ్బ తగిలి శోష వచ్చినప్పుడు విరేచనాలు, వాంతులు యెక్కువై శోష వచ్చినప్పుడు వేడినీళ్ళలో ఉప్పు, పంచదార కలిపి త్రాగిస్తే తక్షణ ఫలితం లభిస్తుంది. నెయ్యి, ఉప్పు కలిపి వేడినీళ్లలో త్రాగిస్తే భోజనం చేయగనే వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది. 
 
ఉపప్పు నీటిని పుక్కిలి బడితే నోటిలో పుండ్లు పంటిపోటు తగ్గుతుంది. ఉప్పును వేసి బాగా కాగనిచ్చి చల్లార్చి ఆ నీటితో పుండును కడిగితతే నీరును లాగేసి పుండు త్వరగా మానిపోతుంది. కండ్ల కలక వచ్చినప్పుడు కంట్లో ఉప్పు నీరు వేసి కడిగితే కంటి వాపు తగ్గిపోతుంది.  ఉప్పు, మిరియాలు కలిపి నూరి పండ్లు తోముకుంటే దంతాలు పుచ్చకుండా దృఢంగా పెరుగుతాయి. ఉప్పు కలిపిన నీటితో తలస్నానము చేస్తుంటే చుండ్రు నివారణమై తలవెంట్రుకలు రాలటం తగ్గుతుంది. 
 
ఒక చెంచా ఉప్పు, కొద్దిగా నీరు అంతే నువ్వుల నూనె, కలిపి నీరంతా ఆవిరైపోయే వరకు మరగకాచి మిగిలిన మిశ్రమాన్ని గజ్జి, దురద, పగుల్ళు లాంటి చర్మవ్యాధులకు పూత మందుగా వాడవచ్చును. ఉప్పు, లవంగము కలిపి చప్పరిస్తుంటే పొడి దగ్గు, ఆయాసము, తగ్గటమే కాకుండా నోటి దుర్వాసన కూడా పోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

తర్వాతి కథనం
Show comments