Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెయిర్ టానిక్ కరివేపాకు... జుట్టు నెరసిపోకుండా ఆపుతుంది...

'కూరలో కరివేపాకులా తీసిపారేశారు' అంటూ వాపోతారు. 'కరివేపాకే కదా' అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. అలాంట

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (12:37 IST)
'కూరలో కరివేపాకులా తీసిపారేశారు' అంటూ వాపోతారు. 'కరివేపాకే కదా' అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. అలాంటి కరివేపాకుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా.. తెల్లబడిపోతున్న జట్టును ఆపొచ్చు. 
 
ప్రస్తుతం చాలా మంది యువతీయువకులకు తెల్లజుట్టు వచ్చేస్తుంది. వాతావరణ కాలుష్యం, అధిక ఒత్తిడి కారణంగా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వస్తుంది. దీంతో వారు చిన్నవయసులోనే వృద్ధులుగా కనిపిస్తుంటారు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు అనేక రకాల ట్రీట్మెంట్లు చేసుకుంటుంటారు. ఈ సమస్యకు కరివేపాకుతో చెక్ పెట్టొచ్చు. 
 
నెరసిపోతున్న సమస్యకు కరివేపాకుతో చెక్ పెట్టొచ్చు. ఒక కప్పు కొబ్బరి నూనెలో 20 కరివేపాకు ఆకులను వేసి కొద్దిసేపు వేడి చేయాలి. కరివేపాకులు నల్లగా మారిన తర్వాత వేడి చేయడం ఆపేసి దించేయాలి. ఇలా వచ్చిన నూనెను వారంలో రెండు మూడు సార్లు మాడుకు మర్దన చేస్తుంటే శిరోజాలు బాగా పెరగడంతోపాటు తెల్లబడటం కూడా తగ్గుతుంది. పైగా, చక్కని రంగుతో నిగనిగా మెరిసిపోతాయి.
 
అంతేకాకుండా, శిరోజ మూలానికి బలం చేకూర్చే గుణంతోపాటు జుట్టుకు మంచి రంగును ఇచ్చే గుణం కరివేపాకులో ఉంది. కరివేపాకును బాగా ఉపయోగించేవారికి జుట్టు అంత త్వరగా తెల్లబడదు కూడా. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం