పచ్చకర్పూరంతో వెన్నను తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే...

ఇటీవల కాలంలో చిన్నా పెద్ద వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాలు సరిగా లేకపోవడమే.... ఏ చిన్న సమస్య వచ్చినా మందులు వాడేసి ఉపశమనం ప

Webdunia
సోమవారం, 28 మే 2018 (22:13 IST)
ఇటీవల కాలంలో చిన్నా పెద్ద వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాలు  సరిగా లేకపోవడమే.... ఏ చిన్న సమస్య వచ్చినా మందులు వాడేసి ఉపశమనం పొందుతాము. కానీ అప్పటికి ఆ సమస్య తగ్గినా పూర్తిగా నయం కాదు. అయితే సహజంగా లభించే కొన్ని పదార్థాలతో మన కంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. మనం తక్కువ ఖర్చుతోనే మన కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకుని కొంచెం మంచి గంధాన్ని కానీ వెన్నను కానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే కంటికి సంబందించిన సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది. ఈ పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల కళ్ల మంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్లలో నుండి నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. కంటిచూపు మందగించడం తగ్గుతుంది.
 
2. కరివేపాకులో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు రెండు కరివేపాకు రెమ్మల్ని తినడం వల్ల కంటి  సమస్యలు దూరమవుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
 
3. పొన్నగంటికూర కళ్లకు మేలు చేయడంలో దానికదే సాటి. తరచూ ఈ కూర తినడం వల్ల కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. పిల్లలకు కంటి సమస్యలు ఉంటే పొన్నగంటి ఆకు రసం ఓ కప్పు తీసుకోవాలి. దానిని నెయ్యితో కలిపి వేడి చేసి ఆ మిశ్రమాన్ని రోజకు ఓ స్పూన్ చొప్పున తాగిస్తున్నట్లయితేవారికి కంటి సమస్యలు దూరమవుతాయి.
 
4. అలాగే కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు, కంటి చూపుని పెంచేందుకు కొన్ని పోషకాహారాలను రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, నట్స్, చేపలు, గుడ్లు, క్యారెట్, టొమాటో వంటి వాటిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments