Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందార పూలతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి... అవేంటో తెలుసుకోండి...

పువ్వులు అనగానే అవి కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగపడుతాయని చాలామంది అనుకుంటారు. కానీ వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం. 1. మందార పూలను ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందులుగా కూడా ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (13:06 IST)
పువ్వులు అనగానే అవి కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగపడుతాయని చాలామంది అనుకుంటారు. కానీ వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం.
 
1. మందార పూలను ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందులుగా కూడా ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
2. ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. 
 
3. విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు.
 
4. మందారపువ్వును హెర్బల్ టీ, కాక్టేల్ రూపాలలోను సేవించవచ్చు. పూలను ఎండబెట్టి హెర్బల్ టీగా తీసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలంటే... నీటిని ఉడకబెట్టిన తర్వాత ఎండిన మందార పువ్వులను అందులో వేయండి. అందులో చక్కెర, కాస్త టీపొడి కలుపుకుని టీలాగా తయారు చేసుకోండి. దీంతో హైబిస్కస్ హెర్బల్ టీ తయారవుతుంది. ప్రతి రోజు దీనిని సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. 
 
5. అలాగే కాక్టేల్ టీ కొరకు దీనిని చల్లగా చేసి అందులో కొన్ని ఐసు ముక్కలు వేసుకుని తాగితే అదే కాక్టేల్ టీ. ఇలా ప్రతి రోజు తీసుకుటుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments