Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నాక్స్‌ను విపరీతంగా లాగిస్తున్న సిటీ జనం

ఇపుడు ఇష్టానుసారంగా ఆహారం తీసుకోవడం అలవాటైపోయింది. సమయం దొరికితే చాలు.. కంటికి కనిపించింది తినేయాల్సిందే. ముఖ్యంగా, ఈ ఫుడ్.. ఆ ఫుడ్ అనే తేడాలేదు. ఏదో ఒకటి.. కడుపుకు లాగించేయాల్సిందే. బేసిగ్గా రోజుకు మ

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (10:37 IST)
ఇపుడు ఇష్టానుసారంగా ఆహారం తీసుకోవడం అలవాటైపోయింది. సమయం దొరికితే చాలు.. కంటికి కనిపించింది తినేయాల్సిందే. ముఖ్యంగా, ఈ ఫుడ్.. ఆ ఫుడ్ అనే తేడాలేదు. ఏదో ఒకటి.. కడుపుకు లాగించేయాల్సిందే. బేసిగ్గా రోజుకు మూడు సార్లు తినాలి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. మూడు కాదు… నాలుగు సార్లు పుష్టిగా ఆరగించాల్సిందే. మరి అలాంటి ఈవెనింగ్ స్నాక్స్ గురించి తెలుసుకుందాం.
 
నిజానికి సిటీ ఫుడ్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త టేస్ట్‌ను కోరుకునే వారు డిఫరెంట్ వెరైటీలను ట్రై చేస్తున్నారు. ఈవెనింగ్ కాస్త రిలాక్స్ అవుతూ… ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ చేస్తూ లాగించే ఫుడ్స్‌కి బాగా క్రేజుంది. 
 
అలాంటి వాటిలో ఫస్ట్ ఆర్డర్ చేసేది… మంచూరియా. మంచూరియాలో డ్రై, వెట్ అంటూ.. స్పైసీ, నార్మల్ టేస్ట్‌తో దొరుకుతున్నాయ్. ఇక నూడిల్స్‌ గురించి చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఇష్టపడే ఫుడ్. అలాగే పాస్తా వెరైటీలకు క్రేజ్ పెరిగింది. ఇప్పుడు చైనీస్ ఫుడ్ కోర్ట్‌లూ కూడా బాగా పెరిగాయి.
 
చాలా మంది డైటింగ్ చేస్తుంటారు. కానీ జంక్ ఫుడ్‌లు ఇష్టానుసారంగా ఆరగిస్తుంటారు. అలాగే, చల్లని సాయంకాలం వేళ మనసును విపరీతంగా ఆకర్షించే ఫుడ్... గరంగరం మసాలా బజ్జీ. ఆయిల్ ఫుడ్‌ ఏదైనా ఫర్లేదులే అని తినేవాళ్లు చాలామంది. ఇవేకాకుండా… పానీపూరీ, చాట్స్…. ఇవన్నీ స్నాక్స్‌లో భాగమే.
 
ఆల్ ఫుడ్ కంట్రోల్ అనే వాళ్లు… డిఫరెంట్ వెరైటీస్ దోశెలు, డ్రైఫ్రూట్స్, ఫ్రూట్స్ ఇలా ఏదో ఒకటి సాయంత్రం తినేస్తారు. మొత్తానికి సిటీ జనానికి ఈవెనింగ్ స్నాక్స్ అనేది కంపల్సరీ అయిపోయింది. అందులోనూ ఉద్యోగులకైతే అది ఇంకా ఎక్కువ. ఇక… ఐస్‌క్రీమ్స్, జ్యూస్‌లు బోనస్ అనుకోండి. మొత్తంమీద సిటీ జనం స్నాక్స్‌ను విపరీతంగా లాగించేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments