రోజూ గ్లాస్ లెమన్ జ్యూస్‌లో కొద్దిగా తేనె, ఉప్పు కలుపుకుని?

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:35 IST)
సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది నీరసంగా, నిస్సత్తువగా కనిపిస్తుంటారు. అలసటకు కూడా గురౌతుంటారు. రోజంతా ఇలా ఉండటం చిరాకును కూడా కలిగిస్తుంది. ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 
 
రోజూ వ్యాయామం చేయడం మంచి అలవాటు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉండటమే కాక అనారోగ్యాలు కూడా దరిచేరవని చెబుతున్నారు నిపుణులు. ఆహార పదార్థాల విషయానికి వస్తే క్రొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తినకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే అలసట తొలగిపోతుంది. 
 
రోజూ గ్లాస్ లెమన్ జ్యూస్‌లో కొద్దిగా తేనె, ఉప్పు కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. నిద్రలేమి వలన నీరసంగా, అలసటగా ఉంటారు. నిద్ర మనకు చాలా ముఖ్యం కనుక రాత్రివేళలో పాలలో కొద్దిగా మిరియాల పొడి, తేనె, చక్కెర కలిపి సేవిస్తే చక్కగా నిద్రపడుతుంది. 
 
శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వలన కూడా నీరసంగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన రక్తసరఫరా మెరుగుపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్వకుంట్ల కవిత రాజీనామాను ఆమోదించిన బీఆర్ఎస్.. నిజామాబాద్‌కు ఉప ఎన్నికలు?

తమ్ముడి పేరున ఆస్తి రాశాడన్న కోపం - తండ్రి, సోదరి, మేనకోడలి అంతం...

భర్తకు బట్టతల.. విగ్గుపెట్టుకుంటాడన్న విషయం పెళ్లికి ముందు దాచారు.. భార్య ఫిర్యాదు

Rakul Preet Singh: హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

కొవ్వూరులో పెను ప్రమాదం తప్పింది.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ అంటే నాకు క్రష్ ఉండేది.. చికెన్ బిర్యానీని సూపర్‌గా వండుతారు.. మాళవిక మోహనన్

దటీజ్ మెగాస్టార్ క్రేజ్ : అమలాపురంలో ప్రీమియర్ షో తొలి టిక్కెట్ ధర రూ.1.11 లక్షలు

NTR House: చెన్నై లోని ఎన్టీఅర్ ఇల్లు కొనుగోలు చేసిన చదలవాడ శ్రీనివాసరావు.. ఎందుకంటే..

మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్ జరిగిందా?

శర్వా, సాక్షి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నారి నారి నడుమ మురారి

తర్వాతి కథనం
Show comments