Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమ్మడి విత్తనాల పొడి తీసుకుంటే..?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (10:19 IST)
గుమ్మడి కాయల్లో రెండు రకాలున్నాయి. ఒకటి తీపి.. మరొకటి బూడిద గుమ్మడి. తీపి గుమ్మడి కాయను వంటకాల్లో ఎక్కువగా వాడుతారు. బూడిద గుమ్మడికాయను దిష్టి తీసేందుకు ఉపయోగిస్తారు. తీపి గుమ్మడికాయ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
 
1. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాస్ నీటిలో కలిపి తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు రావు. అలానే శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. 
 
2. గుమ్మడి కాయ తొక్కలను పొడిలా తయారుచేసుకోవాలి. కాస్త నూనెను మరిగించుకుని అందులో ఈ గుమ్మడి కాయ పొడి, వెల్లుల్లి రెబ్బ, ఉప్పు కలిపి దోసె, ఇడ్లీ వంటి వాటిల్లో వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది.
 
3. గుమ్మడి కాయల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షణగా ఉంచుతుంది. శరీర రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు తరచు గుమ్మడిని తీసుకుంటే ఫలితం ఉంటుంది.
 
4. గుమ్మడికాయను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిల్లో కొద్దిగా చక్కెర లేదా ఉప్పు, కారం కలిపి తింటే నోటికి రుచిగా, తియ్యగా ఉంటుంది. ఇలా వీటిని కప్పు రూపంలో రోజూ తీసుకుంటే.. చలికాలంలో వచ్చే అనారోగ్యాలనుండి ఉపశమనం లభిస్తుంది.
 
5. గుమ్మడికాయల్లో ఉండే విటమిస్ సి డయాబెటిస్ వ్యాధికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ వ్యాధి గలవారు రోజుకో కప్పు గుమ్మడి జ్యూస్ తీసుకుంటే వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
 
5. గుమ్మడి కాయల్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా అధిక బరువు తగ్గుతారు. గుండె వ్యాధులు కూడా దరిచేరవు. గుమ్మడి విత్తనాలు తీసుకుంటే పురుషుల్లో వీర్యవృద్ధి మెరుగుపడుతుంది. 

సంబంధిత వార్తలు

జూన్ 4న మా దేవుడు పిఠాపురంలో అడుగు పెడుతున్నాడు.. పిఠాపురం ఓటర్లు

ఏపీ హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్!!

జీహెచ్ఎంసీ ఉద్యోగి లైంగిక దాడి.. మహిళా ఉద్యోగికి నరకం చూపాడు.. వీడియో వైరల్

భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సహజీవనం.. చివరికి?

ఎన్నికల కౌంటింగ్... గుంటూరులో గట్టి భద్రత.. నలుగురికి మించితే?

కొత్త సినిమాను చూడాల‌నుకునే ప్రేక్ష‌కులకు బాగా నచ్చే చిత్రం ల‌వ్ మీ :దిల్ రాజు

తెలుగు డిఎమ్‌ఎఫ్‌తో మహేష్ బాబు ఫౌండేషన్ సహకారం

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సారంగదరియా’ నుంచి సాంగ్ రిలీజ్

థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న కాజల్ అగర్వాల్ సత్యభామ

అల్లు అర్జున్ పుష్ప -2 ద రూల్ నుంచి శ్రీ‌వ‌ల్లి పై లిరిక‌ల్ సాంగ్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments