Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రలేమికి చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాలి..?

Advertiesment
నిద్రలేమికి చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాలి..?
, మంగళవారం, 25 డిశెంబరు 2018 (17:46 IST)
నేటి జీవితంలో 8 గంటల పని తర్వాత ఇంటికి వచ్చి కాసేపు జీవన సహచరి లేదా సహచరుడితో, పిల్లలతో గడిపి హాయిగా నిద్రపోయే పరిస్థితులు కరువవుతున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే నింపాదితనానికి ఇప్పుడు చోటేలేదు. బతకడానికి డబ్బులు కావాలంటే నిద్రలేచిన మొదలు ఉరుకులు, పరుగులతో ఉద్యోగానికో, పనికో పరుగెత్తాల్సిందే. రోజువారీ లక్ష్యాలు, పేరుకుపోతున్న టార్కెట్ల సాధన మధ్య సరైన నిద్ర కోసం అల్లాడిపోవడమొకటే ఇప్పుడు జనాలకు బాగా తెలిసిన విషయం. కాబట్టి కమ్మని నిద్ర ఎలా లాగించాలో ఇక్కడ చూద్దాం.
 
అరటిపండులో కార్భోహైడ్రెట్స్‌ శాతం ఎక్కువ. ఇవి మెదడులోని ట్రిప్టోఫాన్‌ హర్మోన్‌‌ను ఉత్తేజపరుస్తాయి. అంతేగాకుండా తలత్రిప్పడాన్ని కూడ తగ్గిస్తాయి. ఇంకా అరటి పండులో పుష్కలంగా లభించే మెగ్నీషియం నరాలు, కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. దీంతో సుఖంగా నిద్రపోవచ్చు.
 
రాత్రి వేళల్లో ఆకలిగా ఉంటే ఓట్స్‌ను ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటే సుఖంగా నిద్రపోవచ్చు. ఇక వేడి పాలల్లో ఓట్స్‌, తేనె కలుపుకుని తీసుకుంటే చాలు. 
 
ఇక నిద్రకు ఉపకరించే ముందు గ్లాస్ వేడి పాలు తాగాలని మన పెద్దలు చెప్పిన విషయమే. పాలల్లో ట్రిప్టోఫాన్‌ హర్మోన్‌ ఉత్తేజపరిచే గుణాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. అంతేకాకుండా మెదడుపై ఒత్తిడి పడకుండా చూస్తుందని, శరీరంలోని క్యాల్షియం కొరత లేకుండా చేస్తుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంటింటి చిట్కాలు..?