Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ పచ్చి బఠాణీలను ఆహారంలో చేర్చుకుంటే?

పచ్చి బఠానీలను వంటకాలలో అధికంగా వాడుతుంటాం. ఈ బఠానీలను తరచుగా కూర్మా, ఉప్మా, బిర్యానీ వంటి వంటకాలలో వాడుతుంటాం. ఈ పచ్చి బఠానీలలో పోషకాలు చాలు ఉన్నాయి. తరుచుగా వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (10:27 IST)
పచ్చి బఠానీలను వంటకాలలో అధికంగా వాడుతుంటాం. ఈ బఠానీలను తరచుగా కుర్మా, ఉప్మా, బిర్యానీ వంటి వంటకాలలో వాడుతుంటాం. ఈ పచ్చి బఠానీలలో పోషకాలు చాలా ఉన్నాయి. తరుచుగా వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుండి కాపాడటంలో ఈ పచ్చి బఠానీలు చక్కగా పనిచేస్తాయి.
 
ప్రతిరోజూ వీటిని ఆకుకూరలలో, కూరగాయలలో కలిపి వంటకాలలో తరచుగా తీసుకుంటే విరేచనాలు సాఫీగా జరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ పచ్చి బఠాణీలు చాలా ఉపయోగపడుతాయి. పచ్చి బఠాణీలలో విటమిన్ ఎ, బి1, బి2, సి, ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన బఠాణీలు పిల్లల ఎదుగుదలకు మంచిగా సహాయపడుతాయి. 
 
ఈ పచ్చి బఠాణీలను ప్రతిరోజూ తీసుకుంటే పలు రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుటలో చక్కగా పనిచేస్తాయి. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. ఈ పచ్చి బఠాణీలలో విటమిన్ కె అధిక మోతాదులో దొరుకుతుంది. 
 
బఠాణీలలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటలో ఉపయోగపడుతాయి. అల్జీమర్స్, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాండిడా వంటి రోగాలను నియంత్రించుటకు ఉపయోగపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

తర్వాతి కథనం
Show comments