Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్ష రసంలో పంచదార కలపకుండా త్రాగితే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (20:12 IST)
సాధారణంగా సీజనల్ ప్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఏ సీజన్లో వచ్చే పండు ఆ సీజన్లో తీసుకోవటం  వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ అందుతాయి.  ముఖ్యంగా నల్ల ద్రాక్షలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధకతను పెంచడంలో సహాయం చేస్తుంది. వీటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
 
1. ద్రాక్ష రసంను క్రమంతప్పకుండా తీసుకోవడం వలన గుండె పోటును నివారించుకోవచ్చు. 
 
2. ద్రాక్ష రసం త్రాగడం వలన హై బీపి అదుపులో ఉంటుంది.
 
3. ద్రాక్ష రసంలో పంచదార కలపకుండా త్రాగడం వలన తలనొప్పి తగ్గుతుంది.
 
4. ద్రాక్ష రసంను తరచూ తీసుకోవడం వలన మెటబాలిజం రేటు పెరుగుతుంది.
 
5. ద్రాక్షలో విటమిన్ కె మరియు పొటాషియం అధికంగా ఉండటం వలన  చర్మం పొడిబారకుండా చేసి చర్మానికి  మంచి నిగారింపును ఇస్తుంది. 
 
6. అసిడిటితో బాధపడేవారు రోజూ ఒక గ్లాసు తాజా ద్రాక్షా రసం తాగడం వలన అసిడిటి తగ్గుముఖం పడుతుంది. 
 
7. ద్రాక్షలో సెల్యులోజ్, ఆర్గానిక్ ఆసిడ్ మరియు షుగర్ వంటివి మలబద్ధకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల మలబద్దకంతో బాధపడేవారు ద్రాక్షను తినడం వల్ల చాలా మేలు జరగుతుంది. ద్రాక్ష రసం కడుపులోని ప్రేగులను శుభ్రపరచడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న మలబద్దక సమస్యను నివారిస్తుంది.  
 
8. జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ రక్త ప్రసరణను పెంచుతాయి. దాంతో శిరోజాలకు మంచి నిగారింపు వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

తర్వాతి కథనం
Show comments