Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం సమయానికి చేయకపోతే ఏమవుతుంది...?

Webdunia
మంగళవారం, 31 మే 2016 (22:06 IST)
ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. ఒక క్రమం ప్రకారం భోజనం చేయకపోవడం వల్ల కడుపులో క్రమక్రమంగా గ్యాస్‌ (అసిడిటి) సమస్య పెరిగి, శరీరపటుత్వాన్ని కోల్పోవడం, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
 
అంతేకాకుండా.. అనోరెక్సియా, బలిమియా, బింగీ అనే వ్యాధులు సోకడానికి కూడా అకాల భోజనమే కారణం. ఈ వ్యాధులు మనషులను శారీరకంగా మానసికంగా కుంగదీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధులు మనుషులపై ఏయే ప్రభావాలు చూపుతాయే ఒక్కసారి పరిశీలిద్దాం.
 
అనోరెక్సియా వ్యాధి సోకిన వ్యక్తి తన సాధారణ శరీర బరువులో 15 శాతం బరువును కోల్పోవడం జరుగుతుంది. ఓ క్రమపద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం మహిళలో రుతుక్రమానికి (పీరియడ్స్‌) సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
 
బలీమియా, బింగీ వ్యాధులకు చాలా సారూప్యత ఉంది. కానీ ఈ రెండు వ్యాధులు దాదాపుగా ఒకేరకమైన ఫలితాలను ఇస్తాయి. ఈ వ్యాధి సోకడం వల్ల శరీరానికి అధిక శ్రమ కలుగుతున్న భావన, నీరసంగా అనిపించడం, వాంతులు కావడం వంటి పరిణామాలు సంభవిస్తాయి.
 
ఇకపోతే బింగీ వ్యాధి ఫలితాలు కూడా బలీమియా వ్యాధి ఫలితాలనే చూపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం జరుగుతుంది.
 
కొందరు యువతీయువకులు తమ శరీరాలను నాజూగ్గా ఉంచుకోవడానికి కడుపు మాడ్చుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఈ వ్యాధులు సోకే ఆస్కారం ఉందని వైద్యు హెచ్చరిస్తున్నారు. 
 
ఇందుకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. కాబట్టి ఎన్ని పనులున్నా సమయానికి కడుపు నిండా భోంచేసి ఆరోగ్యాంగా ఉండండని సూచిస్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments