Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండదెబ్బ... నీరసంగా ఉందా..? ఈ చిట్కాలు పాటించండి...

మనం ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేకపోతున్నాం.. దీంతో ఏ చిన్న పని చేసినా నీరసం తప్పట్లేదు. ముఖ్యంగా వేసవిలో నీరసంగా ఉన్నారంటే అధికంగా నీరు సేవించడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Webdunia
మంగళవారం, 31 మే 2016 (21:33 IST)
మనం ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేకపోతున్నాం.. దీంతో ఏ చిన్న పని చేసినా నీరసం తప్పట్లేదు. ముఖ్యంగా వేసవిలో నీరసంగా ఉన్నారంటే అధికంగా నీరు సేవించడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇక నీరసానికి సంబంధించిన లక్షణాలు ఎలావుంటాయంటే తలనొప్పి, కడుపులో వికారంగా వుండటం, కండరాల నొప్పులు, ఏ విషయానికీ త్వరగా స్పందించక పోవటం, మూడీగా ఉండటం, ఆకలి మందగించటం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఏకాగ్రత లోపించడం వంటివని వైద్యులు అంటున్నారు. 
 
ఈ నీరసానికి అనేక కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అవి ఏంటంటే వైద్యపరంగా తేల్చలేని ఆరోగ్యకారణాలు, ఆఫీస్ సమస్యలు, మానసిక సమస్యలు, అనారోగ్యకరమైన జీవన శైలి ప్రధాన సమస్యలని వారు తెలిపారు. 
 
పెద్దలకు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. కానీ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక కారణాల వలన చాలామంది కంటి నిండా నిద్రకు దూరమౌతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే రోజుకు కనీసం 11 గంటలకు పైగా నిద్ర పోవడం కూడా నీరసం ముంచుకు రావడానికి కారణమని తెలిపారు. 
 
మద్యం, ధూమపానం, గుట్కా వంటి మత్తు పదార్థాల ప్రభావంతో మెదడు మొద్దు బారిపోతుంది. ఇంకా 
శారీరకంగా వ్యాయామం లేకపోవడం వలనకూడా మానసిక వత్తిడి పెరిగిపోతుంది. దీనివల్ల యాంగ్జైటీ పెరిగిపోవడం, యాంగ్జైటీవల్ల డిప్రెషన్ పెరిగిపోతుంది. డిప్రెషన్‌తో నిద్రకు దూరమౌతారని వైద్యులు పేర్కొన్నారు. 
 
సమయానుసారంగా పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన కూడా నీరసం వస్తుంది.  
 
అయితే నీరసాన్ని అధిగమించాలంటే..
 
* శరీరంలో నీరు లేకపోయినా నిస్సత్తువ ఆవహిస్తుంది. కాబట్టి నీరు ఎక్కువగా తాగండి. 
 
* కార్బోహైడ్రేట్లు ఎక్కువగావున్న ఆహారం, తృణ ధాన్యాలతో కూడిన ఆహారాన్ని ఉదయంపూట అల్పాహారంగా తీసుకోండి. అతిగా డైటింగ్ చేయడం వల్లకూడా శరీరంలోని శక్తి హరించుకుపోతుంది. దీంతో నీరసం ఆవహిస్తుంది. 
 
* ఒకేసారి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కంటే కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. మహిళలు తీసుకునే ఆహారంలో ఐరన్ మోతాదు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. 
 
* నిద్ర లోపాలను సవరించుకుని తగినంతగా నిద్ర పోవడానికి ప్రయత్నించండి. నిద్ర పట్టడానికి వాడే మాత్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి. 
 
* మద్యపానం, ధూమపానం మానుకోండి. భౌతిక వ్యాయామం తగినంతగావుండేలా చూసుకోండి. దీంతో శరీరానికి కావాల్సినంత నిద్ర లభిస్తుంది. 
 
* ఈ ఆధునిక యుగంలో కంప్యూటర్ లేనిదే ఏ పనీ జరగడం లేదు. కాబట్టి కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయటం, టీవీ చూడటం వంటివి కాస్త తగ్గించండి. 
 
*  దీర్ఘ కాలికంగా డిప్రెషన్, యాంగ్జైటీ కలిగిస్తున్న కారణాలు మీ జీవితంలో ఏమున్నాయో గుర్తించండి. ఆ తర్వాత వాటితో రాజీపడటమో లేక కౌన్సిలింగ్ సహాయం తీసుకోవడమో చేయండి. 
 
* జీవితాన్ని హాయిగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించండి. రోజూ కనీసం 10 నిముషాలైనా నడవండి. శరీరానికి సరైన ఆహారం, వ్యాయామం, మనసుకు తగినంత ప్రశాంతత ఉంటే నీరసం, నిస్సత్తువ మీ దరికి చేరదంటున్నారు వైద్యులు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments