Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డు సొనను కళ్లపై రాస్తే..?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (14:26 IST)
గంటల తరబడి అదేపనిగా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారికి కళ్లు అలసటగా ఉంటాయి. అలానే బయటకు వెళ్ళినప్పుడు వాతావరణం కారణంగా కంట్లో దుమ్ము, ధూళి వెళ్లి కళ్లను ఒత్తిడికి గురిచేస్తాయి. ఈ సమస్యలతో కళ్లు కాంతిని కోల్పోతాయి. కంటికి తగినంత విశ్రాంతి లేకపోతే కూడా కళ్లు అలసటగా ఉంటాయి. దాంతో కంటి కిందట నల్లటి వలయాలు ఏర్పడుతాయి. 
 
ఇంకా చెప్పాలంటే.. కంటి నుండి నీరు కారడం, కళ్లమంట వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వీటన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ కింది చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు. మరి అవేంటో ఓసారి పరిశీలిద్దాం.
 
1. కంటి మంటలను తగ్గించాలంటే... గుడ్డు తెల్ల సొనను తీసుకుని అందులో స్పూన్ మోతాదులో తేనె కలిపి కళ్లపై రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి.. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ నీటితో కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.
 
2. గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలుపుకుని అందులో మెత్తటి బట్టను ముంచి దానిని కళ్ల మీద వేసుకుని ఓ అరగంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే కంటి అలసట తగ్గుతుంది.
 
3. కళ్లు విపరీతంగా మండుతుంటే.. ఐస్‌క్యూబ్స్‌తో కళ్లపై మర్దన చేసుకోవాలి. ఓ 5 నిమిషాల పాటు అలానే చేయాలి. ఇలా చేస్తే కళ్ల ఒత్తిడి తగ్గుతుంది. ధనియాలు కూడా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్లాస్ నీటిలో 2 స్పూన్ల ధనియాలు వేసి రాత్రంత నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా బెల్లం కలిగి తాగితే మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

తర్వాతి కథనం
Show comments