Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట తగ్గాలంటే.. కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకోండి..

పొట్టతగ్గాలంటే.. తక్కువ తినడం కాదు.. ఆహారంలో పోషక పదార్థాలు చేర్చుకోవాలి. కీరదోసను అధికంగా తీసుకోవాలి. ఇందులో కెలొరీలు చాలా తక్కువ. పైగా తొంబైశాతం వరకూ నీరే ఉంటుంది. ఆకలీ వేయదు. అందుకే.. భోజనానికి ముం

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (16:54 IST)
పొట్టతగ్గాలంటే.. తక్కువ తినడం కాదు.. ఆహారంలో పోషక పదార్థాలు చేర్చుకోవాలి. కీరదోసను అధికంగా తీసుకోవాలి. ఇందులో కెలొరీలు చాలా తక్కువ. పైగా తొంబైశాతం వరకూ నీరే ఉంటుంది. ఆకలీ వేయదు. అందుకే.. భోజనానికి ముందు ఒక కీరా తీసుకోగలిగితే అన్నం తక్కువ తినే ఆస్కారం ఉంటుంది. అలాగే బాదం పప్పులను తీసుకోవడం మరిచిపోకూడదు. 
 
బాదం పప్పులు మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయి. శరీరంలో నీరు కూడా పేరుకోకుండా ఉంటుంది. ఆ పోషకాలు అందాలంటే బాదంతోపాటు ఇతర నట్స్‌ తినాలి. ఆకలిగా అనిపించినప్పుడు సమోసాలు, బజ్జీలు తినే బదులు.. పండ్లు ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల చక్కెర్లు, కొవ్వు బాధ ఉండదు. పోషకాలు ఎక్కువగా అందుతాయి. బరువు తగ్గుతారు.
 
అలాగే సెనగలూ, బఠాణీలూ, పెసల మొలకల్లాంటివి పావు కప్పు తిన్నా.. పొట్టనిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. ఇదే బరువు తగ్గడానికి దారితీస్తుంది. పొట్టచుట్టూ కొవ్వు కరగాలంటే కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకోవాలి. ఇందులో డీ విటమిన్లు, బీ12, ఒమెగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి బరువును తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments