Webdunia - Bharat's app for daily news and videos

Install App

దానిమ్మ చెట్టు ఆకులు పొడి చేసుకుని కషాయం తాగితే..?

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (22:14 IST)
దానిమ్మ ఆకు- దానిమ్మ ఆకులను పొడిచేసి కషాయం కాచి త్రాగటం వలన అజీర్తి, ఉబ్బసం తగ్గుతాయి. గ్యాస్ ట్రబుల్ కంట్రోల్‌లో ఉంటుంది.
 
మారేడు ఆకులు- మారేడు ఆకుల్ని నమిలి రసాన్ని  నిదానంగా మింగాలి. కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకొని త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మూలశంక నయమగును.
 
తోటకూర- వారంలో కనీసం రెండు సార్లయినా తోటకూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
 
కొత్తిమీర- కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, భాస్వరం చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణశక్తిని పెంచటమే కాకుండా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. డయోరియాతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 
పుదీనా - ఇది శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. వాంతులు, తలనొప్పి సమస్యలకు పుదీనా రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కడుపునొప్పి, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. 
 
పాలకూర- పాలకూరలో ఎక్కువగా విటమిన్ సి, కాల్షియం, ఇనుము సమృద్దిగా ఉంటుంది.ఇందులో విటమిన్ ఇ ఎక్కువుగా ఉండటం వలన ఇది క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ కె ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.
 
గోంగూర- దీనిలో పొటాషియం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటంవలన రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉండటం వలన ఇది కంటిచూపు బాగా ఉండటానికి దోహదపడుతుంది.
 
నేల మునగ ఆకులు - ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును. ఇది మన శరీరమునకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
 
తులసీ ఆకులు- తులసి ఆకులను శుభ్రపరచుకొని రోజూ ఐదారు ఆకుల చొప్పున తినినచో దగ్గు, వాంతులు, జలుబు తగ్గుతాయి.
 
రావి ఆకులు- రావి ఆకులను మెత్తగా నూరి పొడి చేసి తేనెతో సేవిస్తే శ్వాసకోశవ్యాధులు నయం అవుతాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

Srivishnu: అల్లు అరవింద్ ప్రజెంట్స్ లో శ్రీ విష్ణు హీరోగా #సింగిల్ చిత్రం

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

తర్వాతి కథనం
Show comments