Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేశాక, చేయకముందు ఏం చేయాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (12:42 IST)
మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే కష్టంగా ఉన్నా కొన్ని పద్ధతులను ఇష్టంగా పాటించవలసిందే. ప్రస్తుతకాలంలో ఎక్కువమంది ఎదుర్కుంటున్న సమస్య అధిక బరువు. సాధారణంగా బరువు పెరగడం చాలా తేలికగా పెరుగుతాము. కానీ తగ్గాలంటే చాలా కష్టపడాలి. ఈ సమస్య రాకుండా ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అందుకు భోజనం చేయకముందు, చేశాక కొన్నింటిని తినకుండా ఉంటే బరువు పెరగడం, పొట్ట పెరగడం లాంటి వాటిని నివారించవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. భోజనం చేసే ముందు లేదా తరువాత పండ్లు ఎక్కువగా తినకూడదు. అందువల్ల పొట్ట బాగా పెరిగే అవకాశం ఉంది.
 
2. అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. అలా చేస్తే తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.
 
3. ఎప్పుడైనా తినగానే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు, చేతులులోకి రక్తప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
 
4. అలాగే భోజనం అయ్యాక పది నిముషాల పాటు నడిస్తే మంచిదని అంటుంటారు. కానీ... అలా నడవడం వలన పోషకాలను గ్రహించడంలో జీర్ణ వ్యవస్థ విఫలమవుతుంది. కాబట్టి తిన్న వెంటనే కాకుండా ఒక పది నిమిషముల తరువాత నడిస్తే మంచిది.
 
5. ముఖ్యంగా తినగానే నిద్రపోకూడదు. అలా నిద్రపోతే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments