Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి విత్తనాలు పురుషులు తీసుకుంటే ఏం చేస్తాయో తెలుసా?

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (21:20 IST)
ఉల్లిపాయలు కూరల్లో వేసుకుని తింటుంటాము. పకోడీలు చేసుకుంటాము. ఇంకా రకరకాల వంటకాలు చేసుకుని తింటాము. ఐతే ఉల్లి విత్తనాలు వీర్యాన్ని పెంచడంలోనూ దంత సంబంధ క్రిముల్ని నాశనం చేయడంలోనూ సహాయపడతాయని వైద్యులు చెపుతున్నారు.
 
1. ఉల్లి విత్తనాలు మూత్ర సంబంధ వ్యాధుల్ని నయం చేస్తాయి. 
 
2. ఉల్లికాడలో 'ఎ' విటమిన్‌ లభిస్తుంది. జలుబు, దగ్గు, బ్రాంకైటిస్‌, ప్లూలాంటి జబ్బులకు ఉల్లి చాలా మంచిది. తేనె, ఉల్లి రసాన్ని సమపాళ్లలో కలిపి రోజూ మూడు స్ఫూన్ల చొప్పున తీసుకుంటే జలుబు మన దరికి రాకుండా వుంటుంది. 
 
3. గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది. 
 
4. ఉల్లిపాయ రక్తంలోని కొలెస్టరాల్‌ని తగ్గిస్తుంది. పంటినొప్పితో బాధపడే వాళ్లు ఆ పంటికి లేదా చిగురుకు చేరువలో చిన్న ఉల్లిగడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది. 
 
5. ఉల్లిలోని ఐరన్‌ని మనశరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్లకు ఉల్లిపాయ చాలా మంచిది.
 
6. లైంగిక సామర్థ్యాన్ని పెంచటంలో వెల్లుల్లి తర్వాత ఉల్లి రెండో స్థానంలోకి వస్తుంది. ఇది కోర్కెను పెంచటమే కాకుండా జననేంద్రియాలను పటిష్టం చేస్తుంది కూడా. 
 
7. తెల్ల ఉల్లిని పొరలుగా చీల్చి, దంచి, వెన్నతో కలిపి వేయించుకుని స్పూను తేనెతో కలిపి ఖాళీ కడుపుతో ఆ మిశ్రమాన్ని క్రమంగా తీసుకుంటే అది అధ్బుతమైన శృంగార టానిక్‌గా పనిచేస్తుంది.
 
8. పైల్స్‌తో బాధపడుతున్న వారు 30 గ్రాముల ఉల్లిపాయను చిన్నచిన్న ముక్కలుగా చేసి నీళ్లలో వేసి, అందులో 60 గ్రాముల పంచదార కలుపుకుని రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
9. చెవులు గింగురుమంటున్నప్పుడు ఉల్లిరసాన్ని దూది మీద పిండి ఆ దూదిని చెవిలో ఉంచుకుంటే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా తోట సరే... పక్కనే చంద్రబాబు తోట కూడా వుందిగా, దాని సంగతేంటి? పెద్దిరెడ్డి జస్ట్ ఆస్కింగ్

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి కలకలం : తితిదే అలెర్ట్

Jayalalithaa: దివంగత సీఎం జయలలిత ఆస్తులన్నీ ఇక తమిళనాడు సర్కారుకే

కణతకు గురిపెట్టుకుని తుపాకీతో కాల్చుకున్న ఎస్ఐ.. పాపం జరిగిందో..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

తర్వాతి కథనం