Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోషకాల గని వేరుశనగ పప్పు, ఏమేమి వున్నాయో తెలుసా?

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (21:54 IST)
శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుసెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. ఎ, బి, సి, ఇతో కలిపి మొత్తం 13 రకాల విటమిన్లూ ఐరన్‌, కాల్షియం, జింక్‌, బోరాన్‌... వంటి 26 రకాల కీలక ఖనిజాలూ వీటిల్లో ఉన్నాయి.
 
1. పల్లీల్లో గుండెకు మేలు చేసే వోనో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్‌ శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ.
 
2. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. హెపటైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ వంటివి రాకుండా ఉంటాయి.
 
3. హీవోఫీలియాతో బాధపడేవాళ్లకి ఇవి ఎంతో మంచివి. ముక్కు నుంచి రక్తం కారుతుంటే కాసిని వేరుసెనగపప్పు తింటే తగ్గుతుందట. అలాగే నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు కొంచెం పల్లీలు నానబెట్టి బెల్లంతో కలిపి తింటే ఐరన్‌తో పాటు అన్ని రకాల పోషకాలూ అందుతాయి.
 
4. యాంటీఆక్సిడెంట్లకు ఇవి మంచి నిల్వలు. వేయించిన పల్లీల్లో అయితే వీటి శాతం బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీల్లోకన్నా ఎక్కువ. క్యారెట్లు, బీట్‌రూట్‌లతో పోలిస్తే ఇంకా ఎక్కువని ఇటీవల పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే ఇందులోని పి-కౌమారిక్‌ ఆమ్లం వేయించినప్పుడు 22 శాతం పెరుగుతుందట.
 
5. వీటిల్లోని రిజవెరాట్రాల్‌ అనే రసాయనం హృద్రోగాలనుంచీ, క్యాన్సర్ల బారినుంచీ రక్షిస్తుంది. వృద్ధాప్యం దరిచేరకుండా నిత్యయవ్వనంతో ఉండేలా చేస్తుంది.
 
6. నియాసిన్‌ లోపం కారణంగా వచ్చే దీర్ఘకాలిక డయేరియా బాధితులకీ వేరుసెనగ మంచిదేనట. మేకపాలలో కాస్త నిమ్మరసం పిండి తాగి ఓ గుప్పెడు వేయించిన పల్లీలు తింటే ఈ వ్యాధి తగ్గుతుందట.
 
7. తాజా పచ్చి పల్లీలకు చిటికెడు ఉప్పురాసి తింటే చిగుళ్లు గట్టిబడి దంతాల్ని సంరక్షిస్తాయి.
 
8. పల్లీలు నానబెట్టి ప్రతిరోజు కొంచెం తీసుకోవడం వలన గ్యాస్ సమస్యను ఎదుర్కోవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments