సీతాఫలం ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదు?

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (17:25 IST)
విటమిన్లు, లవణాలు అధికంగా ఉండి, చలికాలంలో ఎక్కువగా దొరికే సీతాఫలం మీగడలాంటి గుజ్జుతో, ప్రత్యేక రుచితో నీళ్లూరిస్తుంది. ఎన్నో పోషక విలువలను శరీరానికి అందించే సీతాఫలం గురించి తెలుసుకుందాము.
 
 
సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీల వరకు శక్తి ఉంటుంది.
 
నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది.
 
ఈ పండు తింటుంటే కండరాలు బలోపేతమై బలహీనత, సాధారణ అలసటను దూరం చేస్తుంది.
 
వాంతులు, తలనొప్పికి విరుగుడుగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులకు మంచి మందుగా ఉపయోగపడుతుంది.
 
సీతాఫలం ప్రతిరోజూ తింటుంటే జుట్టు నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది, కుదుళ్లకు దృఢత్వానిస్తుంది.
 
పేగుల్లో వుండే హెల్మింత్స్‌ అనే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది.
 
ఈ పండు గుజ్జు అల్సర్లపై చక్కటి మందులాగా పనిచేసి ఉపశమనాన్నిస్తుంది.
 
త్రిదోష నివారిణిగా శరీరంలో వుండే వాత, పిత్త కఫ దోషాన్ని తగ్గించడంలో ప్యూరిఫైర్‌గా పనిచేస్తుంది.
 
ఆస్తమా ఉన్నవారు మాత్రం ఈ సీతాఫలంను తీసుకోకూడదు. మధుమేహం ఉన్నవారు తినకూడదు.
 
ఎక్కువగా పండిన పండును తింటే గ్లూకోజ్‌ శాతం ఎక్కువగా ఉండి, చక్కెర వ్యాధిగ్రస్తులకు హాని చేస్తుంది.
 
లివర్‌ వ్యాధితో, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం ఈ సీతాఫలానికి దూరంగా ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డ్రగ్స్, యువతి కోసమే విజయవాడలో యువకుల థార్ జీపులతో ఢీకొట్టుకున్నారట

జీవవైవిధ్య దినోత్సవం: ఐటీసీ మడ అడవుల సంరక్షణ ద్వారా తీరప్రాంత పర్యావరణ వ్యవస్థ బలోపేతం

త్వరలోనే ఏఐ ఆధారిత వైద్య సేవలు.. చంద్రబాబు నాయుడు

వైకాపా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే .. 11 అరాచకాలు ఇవిగోండి : సీఎం చంద్రబాబు ధ్వజం

అయ్యా సీఎం విజయ్ నీ ఉచిత కరెంట్ మాకొద్దు, డబ్బులిస్తాం ఇవ్వు నాయనా: తమిళనాడులో మొదలైన అసంతృప్తి, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

Sandhigdham: సందిగ్ధం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది : పార్ధసారథి

అవి నా ఫోటోలు కాదు.. ఏఐ సృష్టించిన చిత్రాలు.. రుక్మిణి వసంత్

తర్వాతి కథనం
Show comments