Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలి అనుకునేవారు రోజు నాలుగు ఆకులను నమిలితే...

మనం వండుకునే ఆహార పదార్థాలకు రుచిని సువాసనను ఇవ్వడంలో కరివేపాకుకి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక రకములైన ఔషద గుణాలున్నాయి. కానీ చాలామంది కూరల్లో వేసిన కరివేపాకుని తినకుండా ప్రక్కకు నెట్టివేస్తారు. అయితే ఈ కరివేపాకుని తినడం వల్ల అనేక రకములైన ఆరోగ్య

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (22:25 IST)
మనం వండుకునే ఆహార పదార్థాలకు రుచిని సువాసనను ఇవ్వడంలో కరివేపాకుకి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక రకములైన ఔషద గుణాలున్నాయి. కానీ చాలామంది కూరల్లో వేసిన కరివేపాకుని తినకుండా ప్రక్కకు నెట్టివేస్తారు. అయితే ఈ కరివేపాకుని తినడం వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కరివేపాకు మన శరీరానికి చేసే మేలు ఎంతో వుంది. ప్రతిరోజు అయిదు కరివేపాకు ఆకులను తినడం వల్ల జరిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. మధుమేహ వ్యాధితో బాధపడేవారికి కరివేపాకు అద్భుతంగా పని చేస్తుంది. ఎందుకుంటే... ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి. అంతేకాకుండా కరివేపాకుని నమిలి మింగడం వలన చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
 
2. కరివేపాకు శరీరంలోని పేరుకుపోయే కొవ్వుని కరిగిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు రోజు నాలుగు ఆకులను నమిలి మింగడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని బ్యాడ్ కొలస్ట్రాల్ తగ్గించడంతో పాటు శరీర బరువుని తగ్గించడంలో ఎక్కువగా సహాయపడుతుంది.
 
3. కరివేపాకులో విటమిన్ ఎ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల కరివేపాకుని నిత్యం తునడం వల్ల కళ్లకు సంబందించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది కంటి చూపుని మెరుగుపరచడంతో పాటు రేచీకటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
 
4. కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు వెంట్రుకలు రాలడం, పలుచబడటం, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వంటి సమస్యలను దూరం చేసి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అందువల్ల కరివేపాకుని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.
 
5. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మూత్రసంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే కరివేపాకు రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. అంతేకాకుండా ఇది అధిక రక్తపోటుని నివారిస్తుంది.
 
6. అలాగే కరివేపాకుని ఒక మంచి సౌంధర్య సాధనంగా కూడా చెప్పవచ్చు. కరివేపాకులో ఉండే సుగుణాలు చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇది చర్మంపై ఏర్పడే ముడతలు, మచ్చలు, చర్మపు ఇన్ఫెక్షన్లను నివారించడంలో అమోఘంగా పని చేస్తుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడంతో పాటు వృద్దాప్య ఛాయలను దరిచేరనివ్వదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శుక్రవారం ప్రీవెడ్డింగ్ షూట్ - శనివారం వరుడు ఆత్మహత్య!

ఇజ్రాయేల్ టూరిస్ట్ మహిళపై సామూహిక అత్యాచారం

రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం - మిస్టరీ మరణాలుగా మిగిలిపోవు!!

విశాఖపట్టణంలో ఎన్నారై టెక్కీ అనుమానాస్పద మృతి!!

పీటీ వారెంట్‍‌పై కర్నూలు నుంచి భవానీపురం పీఎస్‌కు పోసాని తరలింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి - కొత్త సినిమా అప్ డేట్

నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు : నాని

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

తర్వాతి కథనం
Show comments