Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీరను పచ్చడి రూపంలో తీసుకుంటే..?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (11:32 IST)
శరీరంలో హానికరమైన కొవ్వులను కరిగించాలంటే.. కొత్తిమీర తీసుకోవాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. రోజూ ఆహారంలో కొత్తిమీర తీసుకోవడంతో పాటు వారానికి రెండుసార్లైనా కొత్తిమీరను పచ్చడి రూపంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
గార్నిష్ కోసమే కాకుండా కొత్తిమీరను రోజూ వాడే చట్నీలలో చేర్చి రుబ్బుకుని తీసుకోవడం ద్వారా అలెర్జీలు దూరమవుతాయి. ఇందులోని యాంటీ-యాక్సిడెంట్లు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కంటికి సంబంధించిన వ్యాధుల నివారణకు కొత్తిమీర దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వుల స్థాయిలు పెరిగేందుకు తోడ్పడుతాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. మొటిమలు, పొడి చర్మం, నల్లటి మచ్చల నివారణకు కొత్తిమీరతో తయారైన ఔషధాలు ఉపకరిస్తాయి. కొత్తిమీర శరీరంలో ఇన్సులిన్ తయారీని పెంచుతుంది. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. 
 
కొత్తిమీరలోని ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల తలనొప్పి, మానసిక అలసట, ఒత్తిడి తగ్గిపోతుంది. కొత్తిమీరలోని జింక్, కాపర్, పొటాషియం పుష్కలంగా వుంటుంది. జీర్ణకోశ వ్యాధుల నివారణకు కొత్తిమీర ఎంతగానో ఉపకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments