Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరపకాయ తింటే ఆ శక్తి పెరుగుతుందా...?

సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతారు. కారంగా ఉంటుంది. తినలేమంటూ వంటలో వాడినా పక్కన పడేస్తుంటారు. అయితే మిరపకాయలు తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ప్రధానంగా మిరపకాయ మూత్ర వ్యాధులు గల వారికి హాని కలిగిస్తుంది. వారు మిరపకాయ

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (16:13 IST)
సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతారు. కారంగా ఉంటుంది. తినలేమంటూ వంటలో వాడినా పక్కన పడేస్తుంటారు. అయితే మిరపకాయలు తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ప్రధానంగా మిరపకాయ మూత్ర వ్యాధులు గల వారికి హాని కలిగిస్తుంది. వారు మిరపకాయలకు దూరంగా ఉండడమే మంచిది. 
 
మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. ఆహారాన్ని పచనం జేసి, విరేచనాన్ని కలిగిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినపుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉంది.
 
మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. పావు కేజీ ఆముదంలో రెండు ఎండు మిరపకాయలు వేసి మరిగించి చల్లారిన తరువాత కీళ్లకు మర్థనా చేసుకుంటే నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ నూనెను ఎక్కువగా పూసి రుద్దుతుంటే బొబ్బలెక్కే ప్రమాదముంది. మితంగా వాడుకోవాలి.
 
కొద్ది కారము, దానికి సమానంగా ఇంగువ, పిప్పరమెంతులను కలిపి అజీర్తి విరేచనాలతో బాధపడేవారికి రోజుకు 2-3 పర్యాయాలు కొద్దిగా రాస్తుంటే విరేచనాలు తగ్గుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments