జీడిపప్పు ఎక్కువగా తింటే హానికరమా?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (22:27 IST)
జీడిపప్పు అధిక ఆక్సలేట్ కంటెంట్ వున్నటువంటిది. అందువల్ల వీటిని మరీ ఎక్కువ పరిమాణంలో తిన్నప్పుడు, ఇది మూత్రపిండాల నష్టంతో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముడి జీడిపప్పు సురక్షితమైనదికాదు. వేయించిన లేదా కాల్చిన జీడిపప్పు సురక్షితమైనవి.
 
ఇకపోతే జీడిపప్పులో వున్న ప్రయోజనాలను చూద్దాం. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి ఇవి దోహదపడుతాయి. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది కనుక కాజు తీసుకుంటే మేలు.
 
ఇక రక్తపోటు(బీపి) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది. సెలీనియమ్, మరియు విటమిన్ ఇ వంటివి ఉండటంతో ఇవి కేన్సర్ ను రాకుండా అడ్డుకుంటాయి.
 
ఐతే తినమన్నాం కదా అని ఎడాపెడా తినేయకూడదు. నియంత్రణ ఉండాలి. రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు. ఇదికూడా రెండు దఫాలుగా తింటే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

ప్రియదర్శి, ఆనంది ల ఫన్ రొమాన్స్ చిత్రం ప్రేమంటే

విశాల్... మకుటం’ చిత్రానికి గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments