అది అలా తీసుకుంటే శృంగార శక్తి... హాయిగా నిద్ర...

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (14:33 IST)
కర్పూరం అనగానే భగవంతునికి పూజ చేసిన తరువాత హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తాం అనే విషయం మనందరికి తెలిసిందే. కానీ కర్పూరం వెనుక అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కర్పూరాన్ని పూజాద్రవ్యంగానే కాకుండా ఆరోగ్యభాగ్యాన్ని ప్రసాదించే మహత్తర శక్తివంతమైన ఔషద గుణాలను నిక్షిప్తం చేసుకుని, పలురకాల ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం చూపే ఆరోగ్యప్రదాత కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా శృంగారపరమైన  సమస్యలకు కర్పూరం మంచి ఔషధంలా పని చేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం.
 
1. ఆవనూనెను వేడిచేసి, నాలుగవ వంతు కర్పూరాన్ని అందులో కరిగించి చల్లార్చి నిలువ ఉంచుకుని, తొడలు, ఉదరం మొదలైన భాగాల్లో మర్దనా చేస్తుంటే ఆయా భాగాల్లో సంచితమైన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. రొమ్ములపై గడ్డలున్న చోట మర్దనా చేస్తుంటే కొన్ని విధాలైనా గడ్డలు కరిగిపోతాయి.
 
2. పాదాలు, అరచేతుల చర్మం బిరుసెక్కి పగుళ్లతో బాధపడేవారు, కొబ్బరినూనెలో పసుపు, కర్పూరం కలిపి రంగరించి రాస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
 
3. అరగ్లాసు కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు పంచదార, చిటికెడు కర్పూరం, చిటికెడు ఉప్పు కలిపి రెండు గంటలకు ఒకసారి సేవిస్తుంటే నీళ్ల విరేచనాలు, కలరా వ్యాధి తగ్గుతాయి. అంతేకాకుండా నీరసం, నిస్త్రాణ కూడా తగ్గుతాయి.
 
4. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని తగినంత ఎండుద్రాక్ష కలిపి నూరి సెనగలంత మాత్రలు చేసుకుని రాత్రి నిద్రకు ముందు ఒక మాత్ర చొప్పున కప్పు పాలతో సేవిస్తుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం, స్తంభన సమస్య తగ్గి శృంగార సామర్థ్యం పెరిగి , దాంపత్య సమయంలో సంతృప్తి కలగడమే కాక సంభోగం తరువాత నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
 
5. మిరియాలు, కర్పూరం, నల్లజీలకర్ర పొడి, యాలుకల చూర్ణాలను సమానంగా కలిపి ముక్కుపొడుంలా పీలుస్తుంటే, ముక్కు, సైనస్ తదితరభాగాల్లో సంచితమైన శ్లేష్మమంతా సులువుగా బయటకు వెళ్లి ముక్కుదిబ్బడ, తలబరువు, తలనొప్పి వంటి బాధలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పల్టీలు కొడుతూ కూలిపోయిన అజిత్ పవార్ ఎక్కిన విమానం (video)

AP Budget On February 14: రాష్ట్ర బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 11న ప్రారంభం

Jagan: కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు.. వైఎస్ జగన్

Ajit Pawar, అజిత్‌ మరణం ప్రమాదమే రాజకీయం చేయవద్దు: శరద్ పవార్

RTC Conductor: ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఓ ఆర్టీసీ కండక్టర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం.. ఫిబ్రవరి 26న సీక్రెట్ మ్యారేజ్?

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి

Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు

తర్వాతి కథనం