అత్త కూతురు కౌగలించుకుంది... నిద్రపట్టడంలేదు... ఏం చేయాలి?

సోమవారం, 12 నవంబరు 2018 (14:15 IST)
మాది దిగువ తరగతి కుటుంబం. కొన్ని కారణాల వల్ల ఆస్తులన్నీ పోయాయ్. కానీ మా అత్తయ్య వాళ్లు 25 ఏళ్ల కిందట హైదరాబాదులో సెటిల్ అయ్యారు. మామయ్య వ్యాపారం చేస్తూ కోట్లు గడించారు. నేను ఏదో కొద్దోగొప్పో చదువుకున్నాను. కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉండటంతో నాన్న నగరంలో ఏదైనా ఉద్యోగం చూపించమని అత్తను అడిగారు. ఆమె అక్కడికి వస్తే మామయ్యతో చెప్పి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానంటే వెళ్లాను. వాళ్ల ఇల్లు సినిమా సెట్టింగులా ఉంది. ఇంట్లో పనివాళ్లు కూడా ఉన్నారు. 
 
నేను ఇంట్లోకి వెళ్లగానే వాళ్ల పెద్దబ్బాయి, కుమార్తె ఇద్దరూ కౌగలించుకుంటూ విష్ చేశారు. మా అత్త కొడుకు కౌగిలి నాకు ఎలాంటి ఫీల్ కలుగలేదు కానీ అత్త కూతురు కౌగిలి నన్ను నిద్రపోనివ్వడం లేదు. ఆమెను మళ్లీమళ్లీ కౌగలించుకోవాలనిపిస్తోంది. వీలుంటే... అత్తమామలు ఒప్పుకుంటే ఆమెను పెళ్లాడాలని ఉంది. అంతకంటే ముందే... ఆమెకు నేను చేరువ కావాలని మనసు ఉవ్విళ్లూరుతోంది. ఏం చేయాలి?
 
అదేమరి. మీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు నగరానికి వచ్చి అత్త కూతురుతో అనుచితంగా ప్రవర్తిస్తే మీ అత్తమామలు సాయం చేయకపోగా ఇంటి నుంచి గెంటి వేస్తారు. కనుక అలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పి ముందు ఉద్యోగ ప్రయత్నం చేసి సాధించండి. మీరు ప్రేమిస్తేనే సరిపోదు కదా... ఆమెకు కూడా మీరంటే ఇష్టం కలగాలి. ఉద్యోగం వచ్చాక అలాంటి ఇష్టత ఆమె కూడా వెల్లడిస్తే అప్పుడు పెద్దవారితో మాట్లాడవచ్చు. అందాక మీ మనసును నియంత్రించుకుంటూ ముందుకు వెళ్లండి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చికున్ గున్యాకు చింత గింజలతో చెక్!