Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరియాల పొడిని నెయ్యిలో వేసుకుని తీసుకుంటే? ఫలితం ఏమిటి?

మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చును. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలకి ప్రత

Webdunia
శనివారం, 19 మే 2018 (11:54 IST)
మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చును. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలకి ప్రత్యేక స్థానముంది. ఔషధంగా కూడా మిరియాలను ఉపయోగిస్తారు. మిరియాలు కేవలం నల్లవే కాదు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ లభిస్తున్నాయి. ఎంతో రుచిని, ఘుమఘుమలను అందించే మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
 
మిరియాలను వేయించి వాటిని పొడిచేసి నెయ్యిలో కలుపుకుని తింటే గొంతు బాధలు తగ్గుటకు ఉపయోగపడుతుంది. ఆవు నెయ్యి తినడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇందులో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్లీరయల్ గుణాలు, ఎక్కువగా ఉంటాయి. 
 
నెయ్యిలో మిరియాలు కలిపి తినడం వలన తీవ్రమైన జలుబుకు, దగ్గుకు, గొంతు నొప్పికి ఈ వైద్యం ఉపకరిస్తుంది. ఉప్పుతో పాటు వామును కూడా మిరియాలలో కలిపి పొడి చేసుకుని తీసుకుంటే గొంతులో వచ్చే బాధలు తగ్గిపోతాయి. తినే పదార్థాలపై మిరియాల పొడిని చల్లుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి మంచిది. మతిభ్రమ, మూర్చ, లాంటి వ్యాధులు ఉన్నవారు మిరియాల ఘూటును పీల్చుకుంటే చాలా మంచిది.
 
రొమ్ము క్యాన్సర్ నివారించడానికి మిరియాలు బాగా సహకరిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే హానికారక క్రిములను తొలగించి క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments