Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం తర్వాత ఆపిల్ తింటే.. ఉడకబెట్టిన బంగాళాదుంపతో..?

మామిడి పండు, పుచ్చకాయలలో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎసిడిటీ స్థాయిని తగ్గించడంలో ఆపిల్‌ కీలక పాత్ర పోషిస్తుంది. భోజనం తర్వాత ఒక ఆపిల్‌ తింటే ఎసిడిటీ రాకుండ

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (17:38 IST)
మామిడి పండు, పుచ్చకాయలలో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎసిడిటీ స్థాయిని తగ్గించడంలో ఆపిల్‌ కీలక పాత్ర పోషిస్తుంది. భోజనం తర్వాత ఒక ఆపిల్‌ తింటే ఎసిడిటీ రాకుండా నివారిస్తుంది. బంగాళదుంపలో పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఇది ఎసిడిటీని నియంత్రిస్తుంది. ఉడకబెట్టిన బంగాళదుంప మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
ఇకపోతే.. ఉల్లికాడలు ఎసిడిటీని తగ్గిస్తాయి. ఇందులో ఉన్న పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎసిడిటీని తగ్గించేందుకు దోహదం చేస్తాయి. ఆకు కూరలలో ఉండే ఎంజైములు, క్లోరోఫిల్‌ కడుపులోని ఎసిడిటీని నియంత్రిస్తాయి. గుండెలో మంటగా ఉన్నప్పుడు తాజా నిమ్మ, ఆరెంజ్‌, నారింజ, పైనాపిల్‌, క్యారెట్‌, గుమ్మడి, దోస, సొర కాయరసాలు తాగితే ఎసిడీటీ లేదా గుండెల్లో వచ్చే మంట తగ్గుతుంది.
 
భోజనం చేసే అరగంట, 40 నిమిషాల ముందు గోరు వెచ్చటి నీళ్ళల్లో నిమ్మరసం పిండి తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ సరిగా జరగడమే కాక నిమ్మలో ఉండే పొటాషియం ఆమ్లాలను సమతులం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments