Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యరశ్మికి దూరమయ్యారో... సంతాన సాఫల్యత తగ్గిపోతుందట..

సూర్యరశ్మికి దూరమయ్యే పురుషుల్లో సంతానసాఫల్యత తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సూర్యుని కిరణాలు మానవ శరీరంపై పడాలని వారు సూచిస్తున్నారు. ఎముకసంబంధ వ్యాధులతోబాటు ఇతరత్రా అనేక సమస

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (17:25 IST)
సూర్యరశ్మికి దూరమయ్యే పురుషుల్లో సంతానసాఫల్యత తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సూర్యుని కిరణాలు మానవ శరీరంపై పడాలని వారు సూచిస్తున్నారు. ఎముకసంబంధ వ్యాధులతోబాటు ఇతరత్రా అనేక సమస్యలకు విటమిన్‌-డి లోపమే కారణమని.. అందుకు సూర్యరశ్మిలో కాసేపైనా నిలబడాలని వారు చెప్తున్నారు. 
 
డి విటమిన్‌కు దీనికీ పురుషుల్లోని సంతానసాఫల్యతకీ కూడా సంబంధం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. డి విటమిన్ సప్లిమెంట్లను వాడటం ద్వారా స్త్రీపురుషుల్లో సంతాన సాఫల్యత పెరిగిందట. ఈ సప్లిమెంట్ల వాడకం కంటే రోజు ఉదయం సాయంత్రం పూట సూర్యుని ఎండ శరీరంపై పడేలా పావు గంట నిలబడితే అనారోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు పురుషుల్లో, మహిళల్లో సంతాన సాఫల్యత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
సాధారణంగా డి-విటమిన్‌ సూర్యకాంతి నుంచీ చేపనూనెల నుంచీ లభ్యమవుతుంటుంది. కానీ ఇటీవల చాలామంది కృత్రిమ కాంతిలోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. దాంతో అనేకమందిలో డి-విటమిన్‌ లోపం తలెత్తుతోంది. ఫలితంగా ఊబకాయం, మధుమేహం, సంతానలేమి వంటి సమస్యలు తప్పట్లేదు. వీటిని దూరం చేసుకోవాలంటే.. సూర్యరశ్మి తప్పకుండా శరీరంపై పడాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments