కొవ్వు శరీరంలో పేరుకుపోతే ఇలా చేస్తే మటాష్..

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (22:18 IST)
కొవ్వు శరీరంలో పేరుకుపోతే గుండె సంబంధ సమస్యలు ఎక్కువవుతాయి. అంతేకాదు... ధమనుల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు రక్త ప్రసరణ మార్గం చిన్నదవుతుంది. ఈ సమస్యనే ఎథిరోస్క్లైరోసిస్ అంటారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ధమనులు ఇంకా కుంచించుకుపోయి గుండెకి, మెదడుకి, మూత్రపిండాలకు శరీరంలో సమస్త భాగాలకు జరిగే రక్తసరఫరాలో సమస్యలు వస్తాయి.
 
దీనివల్ల గుండెపోటు లేదా మెదడు రక్త కణాలు చిట్లిపోవడమో జరిగి ప్రాణాపాయం ఏర్పడుతుంది. సమస్య అంతదాకా వచ్చిన తర్వాత ఆసుపత్రులకు పరుగెత్తేకంటే సమస్య రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 
 
రోజూ ఒక వెల్లుల్లి రేకును నమిలి మింగితే చాలు. అలాగే వెల్లుల్లిని పాలలో ఉడికించి పాయసం (రసోనా క్షీరం) తయారుచేసుకుని తాగినా ప్రయోజనం వుంటుంది.
 
పాయసం తయారుచేసే పద్ధతి
ఐదు గ్రాముల వెల్లుల్లి రేకులు తీసుకుని దాని పైపొట్టును తొలగించి, వాటిని 50 మిల్లీలీటర్ల పాలల్లో 6 గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని తీసి 200 మిల్లీలీటర్ల పాలలో వేసి సగానికి సగం తగ్గేదాకా మరిగించాలి. ఆపై వడబోసి నేరుగా కానీ, మధుమేహం లేనివారైతే చక్కెర కలిపి కానీ రోజూ రాత్రివేళ నిద్ర పోయే ముందు సేవిస్తే ధమనులు గట్టిపడి, గుండె సంబంధమైన సమస్యలు రావు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్​కు ఊరట

వివాహేతర సంబంధం.. భర్తను అలా హత్య చేయించిన భార్య.. చివరికి?

వరంగల్, విజయవాడ జాతీయ రహదారులు అనుసంధానించే ప్రాజెక్టు

ఉత్తరాది వ్యాపారుల కారణంగా రాయలసీమ అరటిపండ్లకు భారీ డిమాండ్

పొగమంచు: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఒకదానికొకటి ఢీ.. నలుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

తర్వాతి కథనం
Show comments