Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి...

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (22:42 IST)
చెరకు రసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది బరువును అదుపులో ఉంచుతుంది. చెరుకురసంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
 
1. ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి ప్రతి రోజూ రెండు పూటలా తీసుకోవటం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
 
2. ఈ చెరకు రసం పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది.
 
3. మూత్రపిండాలలో ఉన్న రాళ్ల సమస్యల్ని తొలగించడంలో చెరుకురసం ఎంతగానో దోహదపడుతుంది.
 
4. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అని మనం భావిస్తాము. కానీ, ఇటువంటప్పుడు ఒక గ్లాస్ చెరుకురసం తాగడం వల్ల ఈ జబ్బులను నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. వేసవిలో ప్రతిరోజు ఒక గ్లాసు చెరకురసం త్రాగటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. 
 
5. క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువుగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు ఎక్కువుగా ఉన్నచెరకు రసం బాలింతలు తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
6. చెరకులో కాల్షియం ఉండటంతో అది ఎముకలు దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్నపిల్లల ఎదుగుదలకు చెరకురసం చక్కగా దోహదపడుతుంది.
 
4. శరీరంలో అధిక బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను ఈ రసం తగ్గించగలదు. బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments