Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో బెల్లం వేసుకుని తాగితే...?

బంగారు రంగులో చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా సువాసనతో ఉండే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్య శాస్త్రాలలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడతారు. సాధారణంగా చెరుకు రసం నుండి బెల్లాన్ని తయారుచేస్తారు. బెల్లంలో అనేక రకములైన ఔషద గుణాలున్నా

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (14:43 IST)
బంగారు రంగులో చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా సువాసనతో ఉండే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్య శాస్త్రాలలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడతారు. సాధారణంగా చెరుకు రసం నుండి బెల్లాన్ని తయారుచేస్తారు. బెల్లంలో అనేక రకములైన ఔషద గుణాలున్నాయి. 
 
ప్రతిరోజు కాస్త బెల్లం ముక్క తినడం వల్ల రక్త శుద్ది జరిగి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అంతేకాకుండా లివర్ పని తీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది. బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఫ్రీరాడికల్స్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేఖంగా పోరాడతాయి. మరి ఇన్ని పోషకాలు ఉన్న బెల్లం మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు 100 గ్రాముల బెల్లం తినడం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు.
 
2. వేసవిలో బెల్లం పానకం తాగితే శరీరం చల్లబడి వడదెబ్బ, నీరసం వంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు బెల్లాన్ని తినడం వల్ల ఆడవారిలో నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.
 
3. బెల్లం మంచి ఔషధం. శరీరానికి కావలసిన ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. బెల్లం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
 
4. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కాస్త బెల్లం కలుపుకుని తాగడం వల్ల శృంగార శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.
 
5. బెల్లాన్ని నువ్వులతో కలిపి తినడం వల్ల ఆస్తమా, బ్రాంకైటీస్ లాంటి సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజు మద్యాహ్నం, రాత్రి భోజనం అయ్యాక కాస్త బెల్లం తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. 
 
6. కీళ్ల నొప్పుల భాదితులు రోజూ 50 గ్రాముల బెల్లం చిన్న అల్లం ముక్కని కలిపి తినడం వల్ల ఆ నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. ప్రతిరోజు తాగే పాలల్లో పంచదార బదులు బెల్లం కలుపుకుని తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెస్సీ విద్యార్థిని... ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రియుడు

కోడి పందేలు, బెట్టింగ్ ఆరోపణలు.. నలుగురు వ్యక్తుల అరెస్ట్.. ఎక్కడ?

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments