Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు వ్యాప్తంగా వైద్య ఏటీఎంలు

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (13:47 IST)
చెన్నైలోని ఆస్పత్రుల్లో ఏటీఎం యంత్రాలు కన్పిస్తున్నాయి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారు కదా. ఏటీఎంలు అంతటా ఉంటాయి కదా అని అనుకుంటున్నారు కదా. అయితే అవి మీరు అనుకుంటున్నట్లుగా డబ్బులు డ్రా చేసే ఏటీఎంలు కాదు. ఎనీ టైమ్ మనీ ఏటీఎంలు కావు… ఎనీటైమ్‌ మెడిసిన్‌ ఏటీఎంలు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 23 మెడికల్‌ కాలేజీ ఆస్పత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటూ, మొత్తం 32 ప్రాంతాల్లో ఇలాంటి ఏటీఎంలను ఏర్పాటు చేసింది. 
 
ఈ యంత్రం ద్వారా టీబీ, డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌ వంటి 32 రకాల జబ్బులకు సంబంధించిన మందులు పొందవచ్చు. మెడికల్‌ షాపుల ముందు లైనులో నిలబడే పనిలేకుండా ఈ ఏటఎంల ద్వారా అత్యంత త్వరగా, తేలిగ్గా కావాల్సిన మందులను పొందేందుకు అవకాశముంది. మనకు కావాల్సిన మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. 
 
మందులు కావాలనుకునే వారు ఈ కోడ్‌ని మిషన్‌కు చూపించాల్సి ఉంటుంది. ఆ కోడ్‌ని స్కాన్‌ చేసి ఎన్ని మందులు కావాలో అడుగుతుంది. ఎంత డబ్బు అవుతుందో చెబుతోంది. ఆ డబ్బు ఇవ్వగానే వెంటనే మందులు ఇచ్చేస్తుంది. ఈ ఏటీఎంకు రూ.80 లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం 32 మిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత మందులను కూడా ఈ ఏటీఎంల ద్వారా కూడా పొందవచ్చని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 169 మంది ప్రయాణికులు సేఫ్

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం... పైలెట్ మృతి

Vijayanagara King: శ్వేతశృంగాగిరిలోని తీర్థంలో స్నానం చేసిన కృష్ణదేవరాయలు.. తర్వాత?

అత్తతో అక్రమ సంబంధం.. యువకుడుని చితకబాది బలవంతపు పెళ్లి

Jagan: బంగారుపాలెంలో జగన్ పర్యటన.. భద్రత కట్టుదిట్టం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sirisha: సుడిగాలి సుధీర్ పెళ్లిచేసుకోడు : ధనరాజ్ భార్య శిరీష స్టేట్ మెంట్

Manoj: విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ : మంచు మనోజ్‌

RK Sagar: ఆయన చనిపోయినప్పుడు చాలా పీలయ్యా : ఆర్.కె. సాగర్

పోలీస్ స్టేషన్ పార్ట్ టైమ్ పాఠశాల అనే కాన్సెప్ట్ తో 14 దేశాల్లో సూత్రవాక్యం సిద్ధం

తెలంగాణ నేపథ్యంగా సాగే రాజు గాని సవాల్ టీజర్ ఆవిష్కరించిన జగపతిబాబు

తర్వాతి కథనం
Show comments