Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల రోజుల మందులు... ఒకే క్యాప్సూల్ ద్వారా... మిట్ స్టార్

విజ‌య‌వాడ ‌: ఏ రోగం రానంత వ‌ర‌కే ఏదైనా... వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇక నిత్యం మాత్ర‌లు, ఇంజ‌క్ష‌న్లు ష‌రా మామూలే. ఒక్కోసారి ఈ మాత్ర‌లు వేసుకోవాలంటే విసుగు పుడుతుంది. కొంతమంది రోగులకి ప్రతిరోజూ మాత్రలు వేసుకోవాలంటే పరమ చిరాకు. అందుకే ఒకసారి వేసుకుంటే మళ్లీ

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (18:26 IST)
విజ‌య‌వాడ ‌: ఏ రోగం రానంత వ‌ర‌కే ఏదైనా... వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇక నిత్యం మాత్ర‌లు, ఇంజ‌క్ష‌న్లు ష‌రా మామూలే. ఒక్కోసారి ఈ మాత్ర‌లు వేసుకోవాలంటే విసుగు పుడుతుంది. కొంతమంది రోగులకి ప్రతిరోజూ మాత్రలు వేసుకోవాలంటే పరమ చిరాకు. అందుకే ఒకసారి వేసుకుంటే మళ్లీ నెల రోజుల పాటు వేసుకోవాల్సిన అవసరం లేని కొత్త క్యాప్సూల్ వ‌చ్చింది. మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బ్రైగమ్ ఉమెన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు దీనిని ఆవిష్కరించారు. దీనిని మిట్ స్టార్ క్యాప్సూల్ అని పిలుస్తారు. మాత్ర రూపంలోనే ఉండే ఈ క్యాప్సూల్‌ను ఒక సారి వేసుకుంటే అందులోని మందు ఏరోజుకా రోజు కావాల్సినంత మోతాదులో శరీరంలోకి విడుదల చేస్తుంది.
 
శరీరంలోని పరాన్న జీవుల దుష్ప్రభావాన్ని తగ్గించే ఇవెర్‌మెసిటిన్ అనే మందును ఈ కొత్త క్యాప్సూల్ ద్వారా జంతువులపై విజయవంతంగా పరీక్షించారు. సాధారణ ఆకారం, పరిమాణం ఉన్న ఈ కొత్త క్యాప్సూల్ ఒకసారి కడుపులోకి చేరగానే నక్షత్రం ఆకారంలోకి మారిపోతుంది. తద్వారా పేగుల్లోకి జారిపోకుండా ఉంటుంది. ఇలాంటి క్యాప్సూల్‌తో సాంక్రమిక వ్యాధులకు చికిత్స అందించడం మరింత సులువు అవుతుందని అంచనా. వేసుకోవాల్సిన మందులను ప్రతి రోజూ గుర్తుంచుకోవడం కష్టమయ్యే వారికి ఈ క్యాప్సూల్ ఎంతో మేలు చేస్తుందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న సి.జియోవానీ ట్రావెర్సో తెలిపారు. 
 
ఈ కొత్త క్యాప్సూల్స్ ద్వారా మందులు పని చేసే సామర్థ్యం కూడా పెరుగుతుందని, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయని అంటున్నారు. న్యూరో సైకియాట్రిక్ మందులను ఈ కొత్త క్యాప్సూళ్ల ద్వారా ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తున్నామని లైండ్రా కంపెనీ వ్యవస్థాపకుడు ఆండ్రూ బెలింగర్ తెలిపారు. ఇక ఈ క్యాప్సూల్ వ‌చ్చేస్తే, రోజు మందుల బాధ త‌ప్పుతుంద‌న్న‌మాట‌.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments