Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావుబతుకుల మధ్య మణిపాల్ ఆసుపత్రికి మహిళా రోగి, కాపాడిన వైద్యులు

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (16:36 IST)
విజయవాడ: ఇటీవల 28 సంవత్సరాల వయసు కలిగిన ఒక మహిళ శ్రీమతి దివ్య (పేరు మార్చటమైనది) అర్థరాత్రి సమయంలో గత మూడు రోజులుగా జ్వరం తోపాటు చలి, వెన్నులో నొప్పి, వికారం మరియు వాంతులతో బాధపడుతున్నానని మా మణిపాల్ హాస్పిటల్, విజయవాడకు వచ్చారు. అంతేకాక తనకు మొదటిరోజు నుంచి మూత్ర విసర్జన తక్కువ జరుగుతున్నదని మరియు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నట్లు కూడ చెప్పారు.
 
ఆమెకు నిర్వహించిన శస్త్ర చికిత్స గురించి డా.శ్రీధర్, కన్సల్టెంట్ నెఫ్రాలజీ & కిడ్నీ మార్పిడి వైద్యులు-మణిపాల్ హాస్పిటల్, విజయవాడ వారు మాట్లాడుతూ, “ఆమె హాస్పిటల్‌కు వచ్చిన సమయంలో చాల అయోమయ స్థితిలో ఉన్నారు. ఆమె శ్వాస తీసుకోవటంలోను మరియు మూత్ర విసర్జన చేయుటలోను ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆమెను పరీక్షించిన తర్వాత, ఆమె తీవ్రమైన మూత్ర పిండాల వైఫల్యత, తీవ్రమైన శ్వాస సంబంధిత ఇబ్బంది సిండ్రోమ్ (ARDS), ల్యూకోసైటోసిస్ (తెల్లరక్త కణాలు పెరగటం), పెల్విక్ యురెటేరిక్ జంక్షన్ కాలిక్యులస్ తోటి రైట్ అక్యూట్ పైలోనేఫ్రిటిస్ వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించాము.
 
పైన తెలిపిన ఇన్ని విధాలైన తీవ్రమైన ఇబ్బందులు ఈ కేసులో వుండటం వలన రోగి ప్రాణాపాయ స్థితికి చాల చేరువులో ఉన్నట్లు మేము తెలుసుకున్నాము. ఆమె సంక్లిష్టమైనపై పరిస్థితిని గమనించి, ఆమెను 8 గంటలు పాటు వాసోప్రెసర్స్ మరియు SLED-F (సస్టైండ్ లో-ఎఫిసియన్సీ హిమోడయాఫిల్టరేషన్ )తోటి మెకానికల్ వెంటిలేషన్ పైన ఉంచాము. అటుతర్వాత, ఆమెకు సిస్టోస్కోపీ చేయటం మరియు కుడి మూత్రనాళం (యురేటర్) నకు DJ స్టెంట్ వేయటం జరిగినది. డా.రవిశంకర్-యూరాలజీ, డా.లక్ష్మి ప్రసూన-గైనకాలజీ, డా.బాలాజీ- ఎనస్తీషియాలతో కూడిన డాక్టర్ల బృందం ఇతోధికంగా శ్రమించి ఆమె ప్రాణాలు కాపాడగలిగారు అని వివరించారు.
 
డా.సుధాకర్ కంటిపూడి- హాస్పిటల్ డైరక్టర్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ వారు మాట్లాడుతూ, “ఆమె తమ హాస్పిటల్‌కు వచ్చే సమయానికి చావు-బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆమెకు సరియైన చికిత్స అందించుటకు చర్యలు చేపట్టుటకు ముందుగా ఆమె ప్రస్తుత పరిస్థితిని కొంత చక్కబరచటం మాకు చాల కీలకం అయ్యింది అన్నారు. రోగికి విజయవంతంగా చికిత్స అందించి మరియు ఆమె తిరిగి హాయిగా ఊపిరిపీల్చుకుని సాధారణ జీవితం గడిపేలా ఆరోగ్యం అందించిన డా. శ్రీధర్ మరియు ఆయన బృందాన్ని ఈసందర్భంగా అభినందిస్తూ మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పారు. ఒక రోగి కోలుకుని తన సాధారణ జీవితం గడపటానికి సమాయత్తం కావటం మాకు ఆనందదాయకం మరియు ఆరోగ్య సంరక్షణ  ప్రదాతగా ఈ క్షణాలు మాకు సంతోషాన్ని కలిగించాయి అన్నారు.
 
ఆమె రక్తపోటు(బ్లడ్ ప్రెషర్ ) సాధారణ స్థితికి రావటంతో, రోగి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడి, ఆమె మూత్ర విసర్జనలో (యూరినరీ అవుట్ పుట్) మెరుగుదల వచ్చినది. అటుతర్వాత ఆమెకు వెంటిలేషన్ మద్దతు కూడా తీసివేసాము. ఆమె మూత్రపిండాల వైఫల్యత నుండి పూర్తిగా కోలుకున్నారు. ఆ తర్వాత ఆమె ఒక నెల రోజులకు కుడి మూత్ర పిండం కాలిక్యులస్ కొరకు పెర్క్యుటేనియస్ నెఫ్రో లితోటమీ (PCNL) విజయవంతంగా చేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

తర్వాతి కథనం
Show comments