Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్ర తగ్గితే మోకాలి నొప్పులు ఖాయం...

నిద్రకు మోకాలి నొప్పులకు సంబంధం వుందంటున్నాయి పరిశోధనలు. నిద్ర తగ్గితే మోకాలి నొప్పులు ఎక్కువవుతాయని చెపుతున్నాయి. మనం మేల్కొని వున్నప్పుడు మోకాలి దగ్గర ఎక్కువ కణజాలం చేరుతుంటుందట. నిద్ర సమయంలో ఉత్పత్తయ్యే కొన్ని హార్మోన్లు వాటిని కరిగిస్తాయి. నిద్రల

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2017 (19:21 IST)
నిద్రకు మోకాలి నొప్పులకు సంబంధం వుందంటున్నాయి పరిశోధనలు. నిద్ర తగ్గితే మోకాలి నొప్పులు ఎక్కువవుతాయని చెపుతున్నాయి. మనం మేల్కొని వున్నప్పుడు మోకాలి దగ్గర ఎక్కువ కణజాలం చేరుతుంటుందట. నిద్ర సమయంలో ఉత్పత్తయ్యే కొన్ని హార్మోన్లు వాటిని కరిగిస్తాయి. నిద్రలేమి వల్ల ఆ అవకాశం లేకుండా పోతుంది. 
 
ఎక్కువగా బరువులు ఎత్తడం, ఆ ఎత్తే సమయం ఎక్కువగా వుండటం కూడా మోకాలి నొప్పులకు దారి తీస్తుంది. చేతులపై పడే భారం మోకాలికి పాకి లోపలి కీళ్లూ, ఎముకలు కిందకు జారడం ఇందుకు కారణం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మహిళల్లో ఆర్థ్రరైటిస్ వచ్చే ఆస్కారం ఎక్కువ. కదలికలకు అనుగుణంగా మోకాళ్లు వంగుతాయి. అధిక బరువు వున్నట్లయితే దాని భారం మోకాళ్ల మీద పడుతుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల ప్రకారం శరీర బరువు మోకాలిలోని జాయింట్లపై పడి ఎక్కువ ఒత్తిడిని కలుగజేస్తుంది. 
 
వ్యాయామాలు మరీ ఎక్కువ చేయడం వల్ల మోకాలి సమస్యలు వస్తాయనడం నిజమే. కానీ అస్సలు కసరత్తుల జోలికి వెళ్లని వారిలో కూడా ఇది ఎక్కువగా వుంటుంది. బరువులెత్తే వ్యాయామాలు కాకుండా మోకాలిపై ఎక్కువ ఒత్తిడివ్వని యోగా, నడక, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలను ఎంచుకోవచ్చు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటంటే... ఎత్తు మడమల చెప్పులు వేసుకునేవారిలో దీర్ఘకాలిక మోకాళ్ల నొప్పులు వస్తాయని. ఇది కూడా ఆస్టియో పోరాసిస్‌కి దారితీస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

తర్వాతి కథనం
Show comments