మొలకెత్తిన ఉలవలను తీసుకుంటే మేలెంత?
మొలకెత్తిన గింజలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకో ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలని.. తద్వారా శరీరాన్ని అనారోగ్యాల నుంచి దూరం చేసుకోవచ్చునని వా
మొలకెత్తిన గింజలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకో ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలని.. తద్వారా శరీరాన్ని అనారోగ్యాల నుంచి దూరం చేసుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. మొలకెత్తిన మెంతులు, నువ్వులు, వేరుశెనగలు వంటి గింజలను తీసుకోవడం ద్వారా.. ప్రోటీన్లు, క్యాల్షియం, సోడియం, ఇనుము, పొటాషియం, ఫాస్పరస్ వంటివి లభిస్తాయి. అంతేగాకుండా విటమిన్ ఎ, బీ1, బీ2లు కూడా లభిస్తాయి.
మొలకెత్తిన ధాన్యాలను గుప్పెడు రోజువారీగా తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. మొలకెత్తిన గోధుమలను తీసుకుంటే క్యాన్సర్ కారకాలను దూరం చేసుకోవచ్చు. మొలకెత్తిన నువ్వులను తీసుకుంటే.. బక్కపలచగా ఉన్నవారు బరువు పెరుగుతారు. కంటి దృష్టి లోపాలు దూరమవుతాయి. మొలకెత్తిన మినపప్పు తీసుకోవడం ద్వారా బాలింతలకు మేలు. మొలకెత్తిన ఉలవలు తీసుకుంటే బరువు తగ్గుతారు. మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి. అనారోగ్యాలు దరిచేరవు.