Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి నూనె హానికరమా...?

ఆరోగ్యస్పృహ పెరిగేకొద్దీ రకరకాల ఆహార పదార్థాలు ప్రచారం పొందుతున్నాయి. మధుమేహం తగ్గుతుందని, ఇంకా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ మధ్య కొబ్బరినూనెకు విపరీతమైన ప్రచారం లభిస్తున్నది. రకరకాల సూపర్ డయెట్లలో దీనిని జోడిస్తున్నారు. కేరళీయులు కొబ్బరి నూనెను ఎప్

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (15:42 IST)
ఆరోగ్యస్పృహ పెరిగేకొద్దీ రకరకాల ఆహార పదార్థాలు ప్రచారం పొందుతున్నాయి. మధుమేహం తగ్గుతుందని, ఇంకా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ మధ్య కొబ్బరినూనెకు విపరీతమైన ప్రచారం లభిస్తున్నది. రకరకాల సూపర్ డయెట్లలో దీనిని జోడిస్తున్నారు. కేరళీయులు కొబ్బరి నూనెను ఎప్పటినుంచో వాడుతున్నారు. మిగతా ప్రాంతాల వారికి ఈ నూనె అంతగా అలవాటు లేదు. ఇప్పుడు కొబ్బరినూనెను ఆరోగ్యప్రదాయినిగా ప్రోత్సహిస్తున్నారు. 
 
వెంట్రుకలు రాలడం నుంచి మానసిక ఆందోళన వరకు, ఊబకాయం నుంచి అరిశెమొలల దాకా అన్నిటికీ సర్వరోగనివారిణిగా కొబ్బరినూనెను ముందుకు తెస్తున్నారు. అయితే కొబ్బరినూనె శుద్ధ విషమని హార్వర్డ్ ప్రొఫెసర్ కారిన్ మిషెల్స్ హెచ్చరిస్తున్నారు. శరీరానికి విషమెంత మేలు చేస్తుందో.. ఇదీ అంతే చేస్తుందని ఆమె నొక్కిచెప్తున్నారు. 
 
యూనివర్సిటీ ఆప్ ఫ్రీబుర్గ్‌లో ఇటీవల ఆమె కోకోనట్ ఆయిల్ ఇతర పోషక తప్పిదాలు అనే శీర్షికతో ప్రసంగం చేశారు. ఆమె జర్మనీ భాషలో చేసిన ఆ ప్రసంగం ఇప్పటిదాకా యూట్యూబ్‌లో పదిలక్షల సార్లు చూశారు. కొబ్బరినూనెలో ఉండే గాఢమైన కొవ్వు ప్రమాదకరమైన ఎల్డీఎల్ పరిమాణాన్ని పెంచుతుందని ప్రొఫెసర్ మిషెల్ హెచ్చరించారు.
 
సమతుల ఆహారంలో కొబ్బరి నూనెను కొద్ది మోతాదులో తీసుకుంటే ఫరవాలేదని, శ్రుతి మించితే హృద్రోగాలు తప్పవని ఆమె తెలిపారు. కొబ్బరినూనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మేలు ఏమిటో ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదని పేర్కొన్నారు. దేశదేశాల్లో కొబ్బరినూనెను ప్రోత్సహిస్తుండటంతో సూపర్‌ మార్కెట్లలో ఈ నూనె కొరకు ప్రత్యేక కౌంటర్లు పెడుతున్నారు. బ్రిటన్‌లో గత నాలుగేండ్లలో అమ్మకాలు 16 రెట్లకు పైగా పెరిగాయి. కొబ్బరి నూనెలో 86 శాతం సాంద్రతరమైన కొవ్వు ఉంటుందని, ఇది వెన్నకన్నా మూడోవంతు ఎక్కువని ప్రొఫెసర్ మిషెల్స్ ఉటంకించారు. సాంద్రమైన కొవ్వు వల్ల రక్తంలో ఎల్డీఎల్ పెరిగి గండెజబ్బులు, స్ట్రోక్ రావడం అనేది నిర్ధారణ అయిన విషయమని చెప్పారు. కొబ్బరినూనె రుచిని ఇష్టపడేవారు కావాలంటే అతితక్కువ మోతాదులోనే వాడాలని ప్రొఫెసర్ మిషెల్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments