డబ్బులెక్కువైనా, తక్కువైనా వచ్చేది మాత్రం అదేనట..

పాశ్చాత్య దేశాల్లో కోరికలను తీర్చే భౌతిక సుఖాలు, సౌకర్యాలు తడిపి మోపెడు ఉన్నప్పటికీ అక్కడి యువత చాలా కారణాలతో డిప్రెషన్‌కు లోనవుతుండగా మన దేశంలో యువత కోరుకున్నవి, ఇష్టపడినవి కొనడానికి డబ్బులేక, సరైన ఆదాయ వనరులు లేక మానసిక కుంగుబాటుకు గురవుతున్నారని త

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (02:55 IST)
పాశ్చాత్య దేశాల్లో కోరికలను తీర్చే భౌతిక సుఖాలు, సౌకర్యాలు తడిపి మోపెడు ఉన్నప్పటికీ అక్కడి యువత చాలా కారణాలతో డిప్రెషన్‌కు లోనవుతుండగా మన దేశంలో యువత కోరుకున్నవి, ఇష్టపడినవి కొనడానికి డబ్బులేక, సరైన ఆదాయ వనరులు లేక మానసిక కుంగుబాటుకు గురవుతున్నారని తాజా సర్వేలో తేలింది. ఈ విషయంలో మగవాళ్ల కంటే మహిళల్లోనే డిప్రెషన్ ఎక్కువ అని సర్వే తెలిపింది. పల్లెలు, చిన్నపట్టణాలతో పోలిసే నగరాల్లో ఉండే యువత ఎక్కువగా డిప్రెషన్‌కి గురవుతున్నారని సర్వేలో తేలింది. 
 
భారతదేశంలో యువత మానసిక కుంగుబాటులోకి ఎందుకు వెళ్తున్నారని ఓ సంస్థ సర్వే చేసింది. 22 నుంచి 25 ఏళ్ల మధ్యవయసుండే 1100 మంది యువతీయువకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో దాదాపు 65 శాతంమంది డబ్బులు లేకపోవటం, తక్కువ ఆదాయ వనరులుండటం వల్ల డిప్రెషన్‌కి గురవుతున్నారట. 
 
ఎందుకంటే కనీస సదుపాయాలు, గ్యాడ్జెట్స్‌, ఇతర వస్తువులను కొనలేకపోతున్నామే అనే బాధ యువతను మానసికంగా కృంగదీస్తోందట. ఇక 64 శాతం మంది కేవలం నిద్రలేమి వల్ల డిప్రెషన్‌కి లోనవుతున్నామని సర్వేలో చెప్పుకొచ్చారు. 
 
మగవారితో(55శాతం)పోలిస్తే మహిళల్లో డిప్రెషన్‌ శాతం(66) ఎక్కువగా ఉందని ఈ సర్వేలో తేలింది. ఇక పెద్దవారితో పోలిస్తే యువకులకి వెుచ్యూరిటీ లెవల్‌ తక్కువే. అయితే పల్లెలు, చిన్నపట్టణాలతో పోలిసే నగరాల్లో ఉండే యువత ఎక్కువగా డిప్రెషన్‌కి గురవుతున్నారని సర్వేలో తేలింది. 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments