Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్‌తో పుర్రె వెనుకభాగంలో కొమ్ములు...

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (14:04 IST)
పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్నారా? ముఖ్యంగా, గంటల కొద్ది తలవంచి స్మార్ట్‌ఫోనునే చూస్తున్నారా? అయితే, మీ పుర్రె వెనుక భాగంలో కొమ్ములు వచ్చివుంటాయి. ఓసారి వైద్యుడిని సంప్రదించి చెక్ చేయించుకోండి. లేదంటే ప్రాణాపాయం తప్పదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. ఆస్ట్రేలియా పరిశోధకులు. 
 
గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్ చూసేందుకు మెడ భాగాన్ని అలా ఎక్కువసేపు వంచి ఫోన్‌ తెర వైపే చూస్తూ గడపడం వల్ల.. అక్కడి కండరాలపై అదనపు ఒత్తిడి పడి.. పుర్రె వెనుక దిగువ భాగంలో ఎముక పెరుగుతోందని (బోన్‌ స్పర్స్‌) ఆస్ట్రేలియా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రజ్ఞులు వీటిని 'ఎంథియోసోఫైట్స్'గా పేర్కొంటున్నారు. 
 
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ద సన్‌షైన్‌ కోస్ట్‌లో హెల్త్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డేవిడ్‌ షహర్‌, ఆయన సహచరుడు మార్క్‌సేయర్స్‌ 2016లో.. 1200 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ అధ్యయన ఫలితం 2018లోనే 'సైంటిఫిక్‌ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురితమైనా.. అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, పలువురు స్మార్ట్  ఫోన్ వినియోగదారుల్లో ఈ సమస్య ఉత్పన్నంకావడంతో దీనిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓరి నాయనో అదానీపై కేసుకు ఆంధ్రప్రదేశ్‌కు లింక్... భారీగా ముడుపులిచ్చారట!

స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని సలహా ఇచ్చింది జగనే.. పవన్ (video)

పెంపుడు జంతువుల పట్ల సంపన్నుల పీనాసితనం.. విరక్తితో వెటర్నరీ డాక్టర్...

బాలికపై అఘాయిత్యం : పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు... చంపేసిన ప్రియుడు..

కేటీఆర్ చేసిన కుట్రలకు ఆయన జైలుకు వెళ్లనున్నారు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

తర్వాతి కథనం
Show comments