Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య బీమా పాలసీని తీసుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి...

ఇటీవలికాలంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం కార్పోరేట్ ఆసుపత్రుల్లో మెడికల్ ఖర్చును భరించేస్థాయిలో ప్రజలు లేరు. దీంతో ప్రతి ఒక్కరూ వైద్య బీమా పాలసీని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (17:14 IST)
ఇటీవలికాలంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం కార్పోరేట్ ఆసుపత్రుల్లో మెడికల్ ఖర్చును భరించేస్థాయిలో ప్రజలు లేరు. దీంతో ప్రతి ఒక్కరూ వైద్య బీమా పాలసీని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మెడికల్ పాలసీని తీసుకునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా పాలసీ తీసుకునే ముందు కింది అంశాలను నిర్ధారించుకోవడం ఎంతో మంచిది. 
 
తీసుకునే వైద్య పాలసీ కేవలం చికిత్సకు మాత్రమే వర్తిస్తుందా లేదా మందులకు కూడానా అనేది నిర్ధారించుకోవాలి. ఎంతకాలం పాటు ప్రీమియం చెల్లించాలో సరి చూసుకోండి. పాలసీలో కవర్ అయ్యే, కాని అంశాలను ఒకటికి పది సార్లు నిశితంగా తనిఖీ చేసుకోవాలి. ఎంచుకునే పాలసీ ఆస్పత్రిలో చేరిన తర్వాత పోషణ, ఆసుపత్రిలో ఉండటానికి అయే ఖర్చు ప్రీమియంలో లభిస్తాయా లేదా అని సరిచేసుకోవాలి. 
 
కొన్ని రకాల హెల్త్ పాలసీలకు వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. ఆ టైమ్ పిరియడ్ దాటిన తర్వాతే తీసుకునే పాలసీ వర్తిస్తుంది. అందువల్ల తీసుకోబేయే పాలసీకి ఇటువంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఫలానా డాక్టరు, ఫలానా ఆసుపత్రి వద్దకే వెళ్లాలనే నిబంధనలు ఉన్నాయా.. అలాంటి షరతులు ఉంటే ఆ పాలసీని తీసుకోకుండా ఉండటమే ఉత్తమం. 
 
పాలసీ చికిత్సకు మాత్రమేనా.. లేక మందులకు కూడానా అనేది నిర్థారించుకోండి. పాలసీని మీ ప్రమేయం లేకుండా తొలగించే హక్కు ఇన్సూరెన్స్ కంపెనీకి ఉందా.. అనేది తెలుసుకోండి. ఎంత వయస్సు వరకూ పాలసీ రెన్యూవల్ అవుతుందో తెలుసుకోవాలి. ఇలాటి కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే వైద్య బీమా పాలసీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

తర్వాతి కథనం
Show comments