Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లాన్ని తొక్కతో పాటు అలానే వాడుతున్నారా? ఐతే డేంజరే?

ఔషధ గుణాలున్న అల్లాన్ని రోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే అల్లం తొక్కను తీసేయకుండా అలానే దంచేస్తే మాత్రం డేంజరే అంటున్నారు ఆయుర్వేద ని

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (13:29 IST)
ఔషధ గుణాలున్న అల్లాన్ని రోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే అల్లం తొక్కను తీసేయకుండా అలానే దంచేస్తే మాత్రం డేంజరే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే? అల్లం తొక్కలో విషపదార్థాలుంటాయట. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని.. అందుకే అల్లం ఉపయోగించేటప్పుడు తొక్క తీసేయడం చాలా మంచిదని వారు చెప్తున్నారు. 
 
ఆకలిలేమి, వేవిళ్లు, అజీర్తి వంటి రుగ్మతలను తొలగించుకునేందుకు అల్లం యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. తద్వారా ఆయుష్షును పెంచుతుంది. అల్లం కంటే శొంఠిలో ఎక్కు ఔషధ గుణాలున్నాయి. అల్లం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉదర పేగులో చేర్చే క్రిములను నశింపజేస్తుంది. లివర్‌ను శుభ్రపరుస్తుంది. ఆకలిలేమితో బాధపడేవారు.. అల్లం, కొత్తిమీర తరుగుతో పచ్చడి తయారు చేసుకుని తీసుకోవడం మంచిది. 
 
గొంతునొప్పికి అల్లం రసం మెరుగ్గా పనిచేస్తుంది. కానీ అల్లాన్ని మితంగా తీసుకోవాలి. ఇక అల్లం రసాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే వ్యాధులు దరిచేరవు. బరువు తగ్గుతారు. అల్లం పచ్చడి గొంతు నొప్పి, ఛాతి నొప్పిని దూరం చేస్తుంది. అల్లం రసంలో బెల్లం కలుపుకుని తాగితే వాత సమస్యలు దూరమవుతాయి. అల్లం, పుదీనా పచ్చడిని తీసుకుంటే పిత్త, అజీర్తి దూరమవుతుంది. నోటి దుర్వాసన ఉండదు. చురుగ్గా ఉంటారు. కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

తర్వాతి కథనం
Show comments